మనం తినే ఆహారంలో ఈ పదార్థాలు ఎక్కువైతే ఈ వ్యాధులు తప్పవు?

మన శరీర పోషణకు అవసరమైన మరియు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి అనేక రకాల పండ్లు, కూరగాయలు, పానీయాలు వంటి ఆహార పదార్థాలను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం సర్వసాధారణం. అయితే మనం తినే ఆహారం రుచిగా ఉండడానికి అనేక పదార్థాలను ఉపయోగిస్తుంటాం. ఇవి దీర్ఘకాలంలో మన ఆరోగ్యాన్ని పాడు చేసే విష పదార్థాలుగా మారుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో మనం తినే ఆహార పదార్థాలను నూనెలో వేయించుకొని తినడం సర్వసాధారణంగా మారింది. మన ఆహారంలో నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదే.అయితే నూనెలను ఎక్కువగా వాడిన, వాడిన నూనెలను మళ్లీమళ్లీ వంటకాల్లో ఉపయోగిస్తే మన ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వు పదార్థాలు, విటమిన్స్, ప్రోటీన్స్ నశించిపోయి దీర్ఘకాలంలో రక్త పోటు, గుండె జబ్బులు, ఉబకాయం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ప్రతిరోజు ఉదయాన్నే మనం తాగే కాఫీ ,టీ ,పండ్ల రసాలు మొదలుకొని వివిధ రకాల స్వీట్లలో చక్కెరను ఎక్కువగా ఉపయోగిస్తుంటా. ఇది ఉపయోగించడం తప్పనిసరే కానీ అతిగా ఉపయోగిస్తే చక్కర విషం గా మారే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చక్కెరను అతిగా ఆహారంలో తీసుకుంటే ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. అలాగే రక్తపోటు, ఉబకాయం, కండరాల బలహీనత, మెదడు పనితీరు లోపించడం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.

ఈ రోజుల్లో బాగా ప్రాచీరం పొందిన ఫాస్ట్ ఫుడ్ వంటకాలు రుచికోసం టేస్టీ సాల్ట్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మనం తీసుకునే ఆహారంలో సోడియం శాతం కిడ్నీ పనితీరుపై ప్రభావం పడి కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. రక్తంలో సోడియం పరిమాణం పెరిగితే బ్లడ్ ప్రెజర్ పెరిగి అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

ప్రతిరోజు మనం మైదా పిండిని ఎక్కువగా ఉపయోగించే పిజ్జా, బర్గర్ వంటి బేకరీ ఐటమ్స్ ను ఎక్కువగా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మైదాపిండి జీర్ణం కావడానికి అధిక సమయం తీసుకుంటుంది కావున మలబద్ధకం గ్యాస్టిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, ఉదర సంబంధిత క్యాన్సర్లు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఏ ఆహార పదార్థాన్ని అయినా పరిమితంగా తీసుకుంటే మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.