మధుమేహం, వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచాలంటే మీ ఆహారంలో ఇవి తప్పనిసరి?

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే ఉబకాయం, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, అల్జీమర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులతో ప్రతి దినం కుస్తీ పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో మన శరీరానికి అవసరమైన సంపూర్ణ పోషకాలు లభించకపోవడమే. సంపూర్ణ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలను మన రోజువారి ఆహారంలో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాగులు : ఆహార ధాన్యాలు కంటే రాగిలో చిరుధాన్యంలో 35 రెట్లు అధికంగా కాల్షియం, ఐరన్ ఫాస్ఫరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాగి చిరుధాన్యంతో చేసిన వంటకాలను మన రోజువారి ఆహారంలో తీసుకుంటే కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తొలగిపోతాయి.

కొర్రలు : కొర్రలల్లో అధిక పీచు పదార్ధం,ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. నరాల బలహీనతను తొలగిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

అరికెలు : విటమిన్లు, మినరల్స్ పుష్కలంగాఉంటాయి.
అధిక యాంటి ఆక్సిడెంట్ యాక్టీవిటీ కలిగి ఉండి రక్తం లో చెక్కర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్త పోటు సమస్యను దూరం చేస్తుంది.

సామలు: వీటిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల
వీటిలో అత్యధికంగా ఉన్న పీచు పదార్థం మలబద్ధక సమస్యలు దూరం చేస్తుంది. విటమిన్ బి12 మెగ్నీషియం నాడీ వ్యవస్థను మెరుగుపరిచి మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ క్యాన్సర్ గుణాలు అనేక క్యాన్సర్లను తొలగించడంలో సహాయపడతాయి. థైరాయిడ్ సమస్య నుంచి మనల్ని రక్షిస్తుంది.

ఉదలు: అత్యంత బలవర్ధకమైన చిరుధాన్యం. ఊదలు సులభంగా జీర్ణం అయ్యి మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. ముఖ్యంగా లివర్, కిడ్నీ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఊదలను తమ రోజు వారి ఆహారంలో తీసుకుంటే కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని, ఊబకాయ సమస్యను దూరం చేస్తుంది.