మనలో చాలామంది వంటల్లో సాధారణ ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. తక్కువ ధరకే సాధారణ ఉప్పు లభిస్తూ ఉండటంతో ఎక్కువమంది ఈ ఉప్పును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే సాధారణ ఉప్పును వినియోగించడానికి బదులుగా బ్లాక్ సాల్ట్ ను వినియోగించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. బీపీ సమస్య ఉన్నవాళ్లు బ్లాక్ సాల్ట్ ను వాడితే ఆ సమస్య దూరమవుతుంది.
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చేయడంలో బ్లాక్ సాల్ట్ తోడ్పడుతుంది. బ్లాక్ సాల్ట్ వాడటం వల్ల సైనస్, దగ్గు, జలుబు లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో బ్లాక్ సాల్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్లాక్ సాల్ట్ ను వినియోగించడం వల్ల సులభంగా డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. కీళ్ల నొప్పులను తగ్గించి ఎముకలను దృఢంగా మార్చడంలో బ్లాక్ సాల్ట్ సహాయపడుతుంది.
బ్లాక్ సాల్ట్ తీసుకోవడం ద్వారా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. బ్లాక్ సాల్ట్ వాడటం వల్ల నిద్రలేమి సమస్య దూరం కావడంతో పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు. వేర్వేరు పేర్లతో ఈ ఉప్పు అందుబాటులో ఉండగా ఈ ఉప్పులో సోడియం శాతం తక్కువగా ఉంటుంది. ఈ ఉప్పు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లభిస్తాయి.
చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో ఈ ఉప్పు తోడ్పడుతుంది. బరువు తగ్గించడంలో ఈ ఉప్పు ఉపయోగపడుతుంది. ఈ ఉప్పు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు సైతం సులభంగా కరిగే అవకాశాలు అయితే ఉంటాయి. బ్లాక్ సాల్ట్ ను ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలకు సైతం సులభంగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.