చెవి నొప్పి, చెవిలో చీము కారణం వంటి సమస్యలు తలెత్తుతున్నాయా….ఇవే కారణం కావచ్చు?

జ్ఞానేంద్రియాల్లో ఒకటైన చెవి చాలా సున్నితమైన అవయవం. మనం శబ్దాలను విని గ్రహించడానికి తోడ్పడుతుంది. చెవి విషయంలో అజాగ్రత్త వహిస్తే వినికిడి లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చెవిలోపల సహజ జిగురు లాంటి పదార్థం ఏర్పడుతుంది. దీన్ని గుమిలి లేదా ఇయర్‌వాక్స్ అంటారు. చెవిలో జిగురు లాంటి ఇయర్ వాక్స్ ఏర్పడడంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. అనారోగ్య కారణాలవల్ల మాత్రమే ఇయర్‌వాక్స్ ఏర్పడుతుందని అందరూ భావిస్తారు. ఇది సరైన ఆలోచన కాదు.

ప్రతి ఒక్కరిలో ఇయర్‌వాక్స్ ఏర్పడుతుంది. ఈ జిగట పదార్థం చెవిలోని సున్నితమైన కర్ణభేరిని, రక్తనాళాలను, చెవి లోపలి పొరలను పొడి వారకుండా ఎల్లప్పుడూ తడిగా ఉంచడమే కాకుండా ప్రమాదకర దుమ్ము ,ధూళి కణాలను,హానికర సూక్ష్మజీవులను లోపలికి ప్రవేశించకుండా నివారించి అనేక ఇన్ఫెక్షన్ల నుంచి చెవిని రక్షిస్తుంది. చెవిలోని ఇయర్‌వాక్స్ ను శుభ్రం చేసుకోవడానికి చాలామంది కాటన్ ఇయర్ బర్డ్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. ఎక్కువగా ఇయర్ బర్డ్స్ ను ఉపయోగిస్తే ఇయర్ వ్యాక్స్ ఇంకా లోపలికి వెళ్లి కర్ణభేరి దెబ్బతింటుంది. ఫలితంగా చెవిలో చీము కారణ, చెవి నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

వాస్తవానికి చెవిలో ఏర్పడే గుమిలి ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు సహజసిద్ధంగా అది చెవి నుంచి కిందకు పడిపోతుందని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో మాత్రం గుమిలి అలాగే ఉండిపోతుంది అలాంటివారు మాత్రం వైద్య సలహాలు తీసుకొని శుభ్రం చేసుకోవడం మంచిది. కొందరిలో సీజనల్గా వచ్చే జలుబు వంటి ఇన్ఫెక్షన్ల కారణంగా ఇయర్ వాక్స్ ఎక్కువగా ఏర్పడుతుంది. ఇలాంటివారు అలివ్ నూనె, బాదం నూనెను కొన్ని చుక్కలు చెవిలో వేసుకొని రెండు మూడు రోజుల తర్వాత శుభ్రం చేసుకుంటే మొత్తం చేస్తుంది. లేదా మార్కెట్లో దొరికే ఇయర్ డ్రాప్స్ వేసుకున్న ఇయర్ వాక్స్ మెత్తబడి బయటికి సులభంగా వచ్చేస్తుంది. ఏది ఏమైనా చెవి సున్నితమైన అవయవం కాబట్టి తప్పనిసరిగా వైద్యుని సలహాలు తీసుకొని తగిన చికిత్స చేయించుకోవడమే మంచిది.