వయస్సు మళ్లిన తర్వాత వచ్చే ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ వంటి వ్యాధులు ప్రస్తుతం అన్ని వయస్సుల వారిని కలవరపరుస్తున్నాయి. కొంత దూరం నడిచిన, చిన్నపాటి బరువులెత్తిన వెంటనే నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, మెడ నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో డెలివరీ తర్వాత ఆస్థియోపోరోసిస్ వంటి సమస్య తలెత్తి ఎముకలు బోలుగా మారి విరిగిపోవడం, తరచూ కీళ్ల నొప్పులు సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్ డి తక్కువగా ఉండి క్యాలరీలు కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండడమే.
మనం తీసుకునే ఆహారంలో అత్యధిక కేలరీలు కొవ్వు పదార్ధం ఎక్కువ ఉన్నట్లయితే మన శరీర బరువు తొందరగా పెరుగుతుంది దాని ఫలితంగా కీళ్ల నొప్పులు, రక్తపోటు, గుండె జబ్బులు ,షుగర్ వ్యాధి వంటి అనేక దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. మన రోజువారి ఆహారంలో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్ డి పాస్పరస్ ఐరన్ వంటి ఖనిజ లవణాలు లోపిస్తే ఎముక దృఢత్వం కోల్పోయి ఆస్తియోఫోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు తలెత్తి ఎముకలు బోలుగా మారడం తొందరగా చీకడం విరిగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి మన ఆహార నియమాల్లో కొంత మార్పు చేసుకుంటే సరిపోతుంది.
రోజువారి ఆహారంలో ఎముకల సాంద్రత పెంచే కాల్షియం, విటమిన్ డి, ఐరన్ పుష్కలంగా లభించే గుడ్లు, చేపలు, ఆకుకూరలు, పండ్ల వంటి ఆహారాన్ని తప్పనిసరిగా మన ఆహారంలో భాగం చేర్చుకోవాలి. చాలామంది గుడ్డులోని పచ్చ సోనాను తినకుండా తెల్లసాలను మాత్రమే తింటుంటారు దాని వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి లోపిస్తుంది
అందుకే గుడ్డు మొత్తాన్ని ఆహారంగా తీసుకోవాలి.
మాంసాహారం తినని వారు వారంలో రెండు లేదా మూడుసార్లు క్యాల్షియం విటమిన్ డి సమృద్ధిగా ఉన్న పాలకూరను, లేదా పాలకూర జ్యూస్ ను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. కొవ్వు లేని పాలను ఆహారంగా తీసుకుంటే కొవ్వు శాతం తక్కువగా ఉండి, కాల్షియం విటమిన్ డి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉన్న చిరుధాన్యాలను, డ్రై ఫ్రూట్స్ తమ రోజువారి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. అప్పుడే వయసు మళ్లిన తర్వాత వచ్చే ఆస్తియోఫోరోసిస్ వంటి ప్రమాదకర వ్యాధి బారి నుండి తప్పించుకోవచ్చు.