సన్నగా ఉన్నవారు వ్యాయామం చేస్తున్నారా… అయితే ఇది తెలుకోవాల్సిందే!

మారుతున్న జీవన విధానంలో అధిక ఒత్తిడిని జయించి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.వ్యాయామం చేయడంలో చాలా మందికి అపోహలున్నాయి. ముఖ్యంగా లావుగా ఉండి అతి బరువు సమస్యతో బాధపడే వారు మాత్రమే వ్యాయామం చేయాలి. సన్నగా ఉన్న వారికి వ్యాయామం అవసరం లేదు అన్న భావన చాలామందిలో ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే.

ఉదయం సాయంత్రం కొంత శారీరక శ్రమ కలిగిన నడక, ఎక్ససైజ్, వ్యాయామం, యోగా వంటివి అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో పొంచి ఉన్న హార్ట్ ఎటాక్ , మధుమేహం, హై బీపీ, ఉబకాయం వంటి సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు. మనం సన్నగా ఉన్న లావుగా ఉన్న మన శరీర ఆరోగ్యాన్ని, శరీర దృఢత్వాన్ని పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిందే. కాకపోతే వ్యాయామం చేసే పద్ధతుల్లో కొంత మార్పు ఉంటుంది. సన్నగా ఉన్నవాళ్లు నిపుణుల సూచనల మేరకు ఎక్సర్‌సైజ్‌లు చేయాలి.ముఖ్యంగా సన్నగా ఉన్నవారు కార్డియో వర్కవుట్స్‌ కన్నా స్ట్రెంత్‌ ట్రైనింగ్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

ఎవరైనా ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఫీల్‌ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. అధిక క్యాలరీలు కరగడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. సన్నగా ఉన్నవాళ్లు కాస్త ఒళ్లు చేయాలంటే మనం తీసుకొనే ఆహారంతో పాటు సరి అయిన వ్యాయామం తప్పనిసరి అవుతుంది. ప్రతిరోజు వాకింగ్‌ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. ఒకేవిధమైన ఎక్సర్‌సైజ్‌లు కాకుండా కాంపౌడ్‌ ఎక్సర్‌ సైజ్‌ లు అంటే క్వాట్స్, డెడ్‌ లిప్ట్, బెచ్‌ ప్రెస్, స్కిప్పింగ్‌, డంబెల్‌ రో ఇలాంటివి ప్రయత్నించడం వల్ల కండరాలు గట్టిపడి శరీరాకృతి అందంగా తయారవుతుంది. వట్టి పాదాలతో వాకింగ్ చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.