పుచ్చిపోయిన దంతాలు నొప్పిని కలిగిస్తున్నాయా…. ఈ సింపుల్ చిట్కాతో నొప్పికి చెక్ పెట్టండి!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఇబ్బంది పెట్టే సమస్యలలో దంతాల సమస్య ఒకటి.ఇలా దంతాలు పుచ్చిపోయి ఉండటం వల్ల తీవ్రమైన నొప్పి బాధను కలిగిస్తూ ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లలు అధికంగా చాక్లెట్స్ చక్కర అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం బ్రష్ సరిగా చేయకపోవడం వల్ల ఈ దంత సమస్యలు తలెత్తుతుంటాయి కొందరిలో పళ్ళు పుచ్చిపోయి తరచూ తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి.

ఇలా దంతాల సమస్యతో బాధపడేవారు ఎన్ని సార్లు డాక్టర్ దగ్గరకు వెళ్లిన మందులు వాడుతున్నంతవరకు మాత్రమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతాయి.
ఈ విధంగా పుచ్చిపోయిన దంతాల వల్ల కొందరు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.ఇలా దంతాలు నొప్పించడం వల్ల సరైన తిండి కూడా తినలేక పోతారు. అయితే ఇలా దంతనొప్పి సమస్యలతో బాధపడేవారు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇంట్లోనే సింపుల్ చిట్కాతో ఈ నొప్పి సమస్యకు చెక్ పెట్టవచ్చు మనకు మార్కెట్లో దొరికే స్పటికం తీసుకొని ఒక పది నిమిషాల పాటు ఆస్పటికాన్ని నీటిలో కరిగించాలి.

ఇలా పది నిమిషాల పాటు కరిగిన తర్వాత ఈ నీటిని నోటిలో పోసుకొని బాగా పుక్కలించాలి ఇలా నాలుగు ఐదు సార్లు పుక్కిలించడం వల్ల దంతనొప్పి సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. అలాగే గొంతులో కూడా ఈ నీటిని వేసుకుని బాగా పుక్కిలించిన తర్వాత ఈ నీటిని పడేయాలి ఇలా రెండు మూడు రోజులు పాటు చేయడం వల్ల దంతనొప్పి సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. తిరిగి ఇలా దంతనొప్పి సమస్యతో బాధపడే అవకాశాలు కూడా ఉండవు.