ఆస్తమా సమస్యతో బాధపడేవారు తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తుంటారు.పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు తీవ్రస్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా ఆస్తమా రోగులు చల్లని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా వర్షాకాలం చలికాలం సీజన్లలో వారి బాధలు వర్ణించడం సాధ్యం కాదనే చెప్పొచ్చు.
ముఖ్యంగా ఆస్తమా రోగులు, శ్వాస సంబంధిత అలర్జీ సమస్యలు ఉన్నవారు రోజువారి ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి లేకపోతే
శ్వాస వాహికలో వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడం మరింత ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి చాలామంది ఎక్కువగా టీ, కాఫీ వంటి పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఆస్తమా సమస్య ఉన్నవారు ఈ పొరపాటు చేయకండి. టీ కాఫీ వంటివి ఎక్కువగా తాగితే గ్యాస్టిక్, ఉభసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉబ్బసం ఆస్తమా సమస్యను మరింత పెంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించవచ్చు.
ఆస్తమా రోగులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే చల్లని,పుల్లని పదార్థాలను అస్సలు తినకూడదు. ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, శీతల పానీయాలను తాగితే ఇన్ఫెక్షన్ ప్రారంభమై గొంతు నొప్పి, జలుబు సమస్య తలెత్తుతుంది తద్వారా ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బందిగా మారుతుంది.అలాగే మసాలా దినుసులను టేస్టీ సాల్టును అధికంగా ఉపయోగించి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పుల్లలు రుచి కలిగిన సిట్రస్ జాతి పండ్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదే అయితే ఆస్తమా సమస్య ఉన్నవారు నిమ్మ ,బత్తాయి, నారింజ, ఆపిల్ జ్యూసులను తాగే విషయంలో వైద్య సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ వీటి జ్యూసులను తాగాల్సి వస్తే ఐస్ వేసుకోకుండా తాగడం మంచిది.