సాధారణంగా ప్రతి నెల అమ్మాయిలు పీరియడ్స్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా ప్రతి ఒక్క అమ్మాయి ప్రతినెల నెలసరి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కానీ కొందరిలో మాత్రం నెలసరి సక్రమంగా రాకపోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా అమ్మాయిలలో నెలసరి సక్రమంగా రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఇలా పెళ్లయిన అమ్మాయిలలో నెలసరి సక్రమంగా రాకపోవడం వల్ల ఆ ప్రభావం గర్భధారణ పై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే పీరియడ్స్ విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది.
ఇక పీరియడ్స్ నెల నెల సక్రమంగా రాలేదు అంటే అందుకు కొన్ని కారణాలు కూడా కావచ్చు ఒకటి మనం తీసుకునే ఆహారం కాగా రెండవది మనం ఎదుర్కొంటున్న ఒత్తిడి కూడా కారణం కావచ్చు.మరి నెలసరి సక్రమంగా రాకపోవడానికి గల కారణాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం..అమ్మాయి వృత్తిపరమైన జీవితంలోనూ ఇంటి పనులు చేసుకుంటూ కొన్నిసార్లు అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇలా అధిక ఒత్తిడికి గురవడం వల్ల వారి శరీరం కార్టిసాల్‌ను అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది, ఇది మీ పునరుత్పత్తి వ్యవస్థ పై ప్రభావం చూపి పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి కారణం అవుతుంది.
ఇక శరీర బరువు వేగంగా పెరగడం లేదా తగ్గిపోవడం వంటివి చేయడం వల్ల మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ రావడానికి ఆలస్యం కావచ్చు. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి థైరాయిడ్ రుగ్మతలు మీ రుతు చక్రంపై ప్రభావం చూపుతాయి. పీసీఓఎస్ అనేది హార్మోన్ల రుగ్మత. ఇది క్రమరహిత పీరియడ్స్‌తో ఆలస్యమైన అండోత్సర్గానికి దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అధిక శరీర వ్యాయామాలు, పోషకాహార లోపం కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం, పిల్లలు ఆలస్యంగా పుట్టాలని మందులు వాడే వారిలో కూడా ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.