Weight Loss: ప్రతిరోజూ నీరు ఈ టైంలో తాగితే చాలు.. డైట్ లేకుండానే బరువు తగ్గిపోతారంట..!

బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా డైట్‌లు, వ్యాయామాలపై దృష్టి పెడతారు. అయితే, నిపుణులు చెబుతున్నది తెలిస్తే షాక్ అవుతారు. నీరు సరైన సమయంలో, సరైన విధంగా తాగితే అది సహజసిద్ధమైన స్లిమ్మింగ్ మెడిసిన్‌లా పనిచేస్తుంది. డైట్, వ్యాయామం ఎంత అవసరమో, నీరు త్రాగే విధానం కూడా అంతే ముఖ్యమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు వేడి నీరు తాగడం ఉత్తమమైన అలవాటుగా భావిస్తారు. వేడి నీరు శరీర రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, కణాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అదనంగా, వేడి నీరు శరీరంలోని విషపదార్థాలను చెమట ద్వారా బయటికి తోలివేస్తుంది. దీనివల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది బరువు తగ్గే ప్రక్రియలో సహజ మద్దతు ఇస్తుంది.

అంతే కాదు, భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగితే ఆకలి సహజంగానే తగ్గిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం తెలుస్తోంది. ఈ అలవాటును పాటించిన వారు 12 వారాల్లో 2 కిలోల వరకు బరువు తగ్గారు. మరొక పరిశోధనలో, భోజనం ముందు నీరు తాగిన అధిక బరువు గలవారు, నీరు తాగని వారితో పోలిస్తే 44 శాతం ఎక్కువగా బరువు తగ్గారని నిర్ధారించారు.

నీరు తాగడం వల్ల శరీరంలోని మెటబాలిజం వేగవంతమవుతుంది. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగడం ద్వారా కేలరీలు కరుగుతాయి. కానీ గ్యాస్, చక్కెర ఉన్న పానీయాల కంటే సాధారణ నీరు తాగడం ఉత్తమం. ఫ్రిజ్ నీరు కాకుండా గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు లేదా గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియకు మరింత మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

బరువు తగ్గాలంటే నీరు ఒక్కటే సరిపోదు. సరైన ఆహార అలవాట్లు, నిత్యవ్యాయామం, తగిన నిద్ర కూడా అవసరం. వీటన్నింటికి తోడు నీరు సమయానికి తాగడం అలవాటు చేసుకుంటే ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లు, నీరు త్రాగే పద్ధతిలో చిన్న మార్పులు చేస్తే పెద్ద మార్పులు చూడవచ్చు. ఉదయం లేవగానే వేడి నీరు, భోజనానికి ముందు గ్లాసు నీరు, వ్యాయామం తరువాత ఎక్కువ నీరు తాగడం వంటి అలవాట్లు అధిక బరువు సమస్యను నియంత్రించడంలో అద్భుత ఫలితాలను ఇస్తాయి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో ఉన్న సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)