పీరియడ్స్ వాయిదా వేయాలని అనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే!

సాధారణంగా అమ్మాయిలు నెలసరి విషయంలో ఎన్నో అనుమానాలను కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో వేర్వేరు కారణాల వల్ల పీరియడ్స్ వాయిదా వేయాలని ఫీలవుతూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండటంతో పాటు కొంతమంది అమ్మాయిలు నీరసంగా ఉంటారనే సంగతి తెలిసిందే. పీరియడ్స్ వల్ల అమ్మాయిలు కొన్నిసార్లు ఈవెంట్లు మిస్ అవ్వాల్సి ఉంటుంది.

అయితే పీరియడ్స్ వాయిదా వేయాలని భావించే అమ్మాయిలు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆ పని చేయడం సాధ్యమవుతుంది. కొన్ని న్యాచురల్ టిప్స్ పాటించడం ద్వారా పీరియడ్స్ వాయిదా వేయడంతో పాటు ఎలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ న్యాచురల్ టిప్స్ పాటించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే ఛాన్స్ కూడా ఉండదని చెప్పవచ్చు.

నిమ్మరసం తాగడం ద్వారా పీరియడ్స్ ను వాయిదా వేయడం సాధ్యమవుతుంది. పీరియడ్స్ లో ఫ్లో తగ్గించే విషయంలో నిమ్మరసం ఎంతగానో సహాయపడుతుంది. లెమన్ పీరియడ్ కాంప్లికేషన్స్ ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. నెలసరి రావడానికి మూడు లేదా నాలుగు రోజుల ముందు నుంచి లెమన్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

పాలలో ఆవాల పొడిని వేసి నెలసరి వచ్చే వారంలో తాగడం వల్ల కూడా అమితమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ సైడర్ వినేగార్ ను నెలసరి రావడానికి 10 రోజుల ముందు నుంచి తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. నెలసరి వాయిదా వేయాలంటే పెప్పర్, స్పైసీ ఫుడ్స్ కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.