శీతాకాలంలో మాత్రమే ఎక్కువగా లభ్యమయ్యే చిలగడదుంపలను ఎంతో ఇష్టంగా మనందరం తింటుంటా. వీటిని స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారు.చిలగడ దుంపల్లో మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్,కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు శీతాకాలంలో మన శరీరంలో వేడిని కలగజేసే గుణాలు ఉన్నందున వీటిని శీతాకాలంలో తప్పనిసరిగా తినాలని చెబుతుంటారు.స్వీట్ పొటాటో ను వారంలో రెండు లేదా మూడుసార్లు ఉడకబెట్టుకొని లేదా పచ్చివి తింటే ఉబకాయ సమస్య, శ్వాస సమస్యలు, జీర్ణ సమస్యలు తొలగిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిలగడ దుంపలకు కొందరు మాత్రం దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె జబ్బు ఉన్నవారు చిలగడ దుంపలను ఎక్కువగా తింటే వీటిలో అత్యధికంగా లభ్యమయ్యే పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను వేగవంతం చేసి గుండె పనితీరును దెబ్బతీస్తుంది దాంతో గుండెపోటు సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి.
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు చిలగడ దుంపలను ఎక్కువగా తింటే వీటిలో అత్యధికంగా ఉండే ఆక్సలేట్ అనే మూలకం కిడ్నీలో రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది. కావున కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటమే మంచిది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు చిలగడ దుంపలను ఎక్కువగా తింటే వీటిలో అత్యధికంగా లభ్యమయ్యే క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలు మరింత పెరిగి మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంచడం చాలా కష్టం అవుతుంది. తరచూ కడుపునొప్పి సమస్య,
డయేరియా, విరోచనాల సమస్యతో బాధపడేవారు చిలగడ దుంపలను ఎక్కువగా తింటే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటివారు చిలకడ దుంపలను తినాలనిపిస్తే వైద్య సలహాలు తీసుకొని తక్కువ మోతాదులో తినవచ్చు.