గుండెపోటు సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయను ఎక్కువగా తింటున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

ఉల్లిపాయ లేదా ఎర్రగడ్డను రోజువారి ఆహారంలో ఉపయోగించడం సర్వసాధారణం.ఉల్లిపాయలో మన ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వులు, సోడియం నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్ బి, పొటాషియం, సల్ఫర్ వంటి మూలకాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తొలగించి గుండె జబ్బు,అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలను నియంత్రిస్తుంది. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియన్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి.

ఉల్లిపాయను మన ఆహారంలో తగిన మోతాదులో తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు మన ఆరోగ్య పరిస్థితి దృశ్య కొందరు ఉల్లిపాయను తక్కువగా తీసుకోవడం లేదా అసలు తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. గుండె శాస్త్ర చికిత్సలు చేయించుకున్నవారు ఉల్లిపాయలు ఎక్కువగా తింటే వారు ఉపయోగించే మందులతో రియాక్షన్ అవుతుందని చెబుతున్నారు. ఇలాంటివారు ఉల్లిపాయను తినాలనుకుంటే వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.

తీవ్రమైన చర్మ సమస్యల్లో ఒకటైన తామర గజ్జి వంటి సమస్యలతో బాధపడేవారు ఉల్లిపాయను ఎక్కువగా తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది.ఉల్లిపాయను కత్తిరించడం వలన సల్ఫర్ మెటాబోలైట్ ఒక రూపం లాక్రిమేటరీ ఫ్యాక్టర్ విడుదల అవుతుంది. కంటి అలర్జీలతో బాధపడేవారికి సమస్య మరింత తీవ్రమవుతుంది. ఉల్లిపాయను మోతాదుకు మించి ఆహారంగా తీసుకుంటే వీటిలో ఉన్న అధిక ప్రోటీన్లు ఇమ్యూనిటీ సిస్టంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయని కొందరు వైద్యులు చెబుతున్నారు.

జీర్ణ సంబంధిత సమస్యలైన యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్నవారు ఉల్లిపాయను అతిగా తింటే గుండె దడను పెంచుతుందని కొన్ని అధ్యయనాల్లో తెలిసింది. పచ్చి ఉల్లిపాయను అతిగా తింటే ఇందులో ఉండే ఘాటు ఔషధ గుణాలు కొందరిలో అలర్జీ సమస్యలకు దారితీసి కళ్ళు ఎర్రబడి నీరు కారణం, చర్మంపై దద్దుర్లు, మచ్చలు వచ్చి చికాకు కలిగిస్తుంది. ఉల్లిపాయను కట్ చేసి ఎక్కువ సమయం ఉంచితే విషపూరితమయ్యే ప్రమాదం ఉంది కావున ఉల్లిపాయను ఆహారంగా ఉపయోగించే ముందు కట్ చేసుకోవడం మంచిది.