మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి చెడు మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.మన రోజువారి ఆహారపు అలవాట్ల కారణంగా కిడ్నీ పనితీరులో సమస్యలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల సమస్య వల్ల తీవ్రమైన నొప్పి, బాధ అనుభవించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. నీటిని తక్కువగా తాగే వారిలో శరీరంలో నీటి శాతం తగ్గి కాల్షియం,ఫాస్ఫేట్స్, ఆక్సిలేట్స్ వంటి రసాయనాలు పేరుకొని కిడ్నీలో రాళ్ళగా మారుతాయి.ఈ రాళ్ళు మూత్రపిండాల నుండి, మూత్రాశయంలోకి ప్రవేశించిన తర్వాత తీవ్రమైన నొప్పి తో పాటు ముత్రాశ ఇన్ఫెక్షన్ ఏర్పడి అనేక సమస్యలు తలెత్తుతాయి.
కిడ్నీలో రాళ్ల సమస్యలు తొలగించుకోవడానికి నీళ్లను ఎక్కువగా తాగడంతో పాటు కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ తులసి రసంలో తేనే కలిపి 90 రోజులు పాటు సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ప్రతిరోజు అల్పాహారం ముందు ఒక గ్లాస్ నిమ్మరసం తాగడం వల్ల నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీలో ఉండే క్యాల్షియం స్టోన్ ను కరిగించి బయటకు వచ్చేలా చేస్తుంది.దానిమ్మ రసాన్ని క్రమంతప్పకుండా తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తొలగిపోతుంది.
గోదుమ గడ్డిలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలో రాళ్ల సమస్యలు నయం చేస్తాయి. కావున ప్రతిరోజు గోధుమ గడ్డిని జ్యూస్ రూపంలో తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తొలగిపోతుంది.ఉలవల్లో ముల్లంగి ఆకులను వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చారుగా తయారుచేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కిడ్నీలో రాళ్లు తొందరగా కరిగిపోతాయి. మామిడి ఆకులను పొడిగా తయారు చేసుకుని ప్రతిరోజు నీళ్లలో కలుపుకొని సేవిస్తే కిడ్నీ లో రాళ్లు తొందరగా కరిగిపోతాయి. కొత్తిమీర కషాయాన్ని ప్రతిరోజు సేవిస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్లు తగ్గి నొప్పి నుంచి తొందరగా విముక్తి కలుగుతుంది.