ఈ చిట్టి విత్తనాలతో షుగర్ వ్యాధికి సులువుగా చెక్ పెట్టే అవకాశం.. ఏం చేయాలంటే?

Complication-of-Uncontrolled-Diabetes

ప్రస్తుత కాలంలో అత్యధిక మందిని వేధిస్తోంది షుగర్ వ్యాధి. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. ఇంగ్లీషు మందులు వాడకం వల్ల కంట్రోల్ ఉంటుందని తప్ప, పూర్తిగా నయం అవ్వటం మాత్రం ఉండదు. దీనివల్ల ఏ ఆహారం తీసుకోవాలన్న ఈ వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అయితే ఈ రకమైన విత్తనాలతో సులువుగా చెక్కర వ్యాధికి చెక్ పెట్టవచ్చని అంటున్నారు.

చెక్కర వ్యాధి లేదా షుగర్ కు రోజువారీగా మందులు వాడాల్సిందే. కనీసం రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకోని వారు ఉండరు.
నెల నెల చెక్ అప్ తప్పని సరిగా ఉంటుంది. వేలకు వేలు ఈ వ్యాధిని చూయించుకునేందుకు తగిలేస్తున్నామనే బాధ వ్యాధిగ్రస్తుల్లో ఉంటుంది. పైగా నయం కాదు. కేవలం కంట్రోల్ లోనే ఉంటుంది. ఏదైనా నచ్చిన స్పీట్ తినాలంటే ఈ షుగర్ ఉన్నవాళ్లు తినలేరు. అయితే చియా సీడ్స్‌ వల్ల షుగర్ ను పూర్తిగా పారదోలవచ్చని అంటున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చియా సీడ్స్ వినియోగం అత్య‌ధికంగా పెరిగింది. ఇక మ‌ధుమేహుల‌కు చియా సీడ్స్ ఓ వ‌ర‌మని అంటారు. షుగ‌ర్ కంట్రోల్ ద‌గ్గ‌ర నుంచి వెయిట్ లాస్ వ‌ర‌కు అనేక విధాలుగా చియా సీడ్ ఉపయోగమట. ఒక గ్లాస్ తీసుకుని అందులో ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ వాట‌ర్‌లో నాన‌బెట్టుకున్న చియా సీడ్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్‌ ఆపిల్ సైడర్ వెనిగర్, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, గ్లాస్ గోరు వెచ్చ‌ని వాటర్ వేసుకుని బాగా క‌లిపి సేవించాలి.

రోజూ ఉదయాన్నే చియా సీడ్స్‌ను ఈ విధంగా తీసుకుంటే షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది. బాడీ డిటాక్స్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది. మ‌ధుమేహం ఉన్న‌వారు త‌ర‌చూ నీర‌సం స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు. ఇందుకోసం బ్లెండ‌ర్ తీసుకుని అందులో నాన‌బెట్టుకున్న చియా సీడ్స్ ను రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే మంచిదట.

ఇక మ‌ధుమేహం ఉన్న వారు చియా సీడ్స్‌ను స‌లాడ్స్‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు. గోధుమలతో కలిపి ఉడికించి తినవచ్చు. ఓట్ మీల్ లో కలుపుకుని తీసుకోవ‌చ్చు. ఇలా ఏ విధంగా తీసుకున్నా ఆరోగ్యానికి చియా సీడ్స్ ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డానికి సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి. మరి షుగర్ ఉన్నవాళ్లు ఓ సారి ట్రై చేయండి.