నరాల బలహీనతను, కామెర్ల వ్యాధిని అదుపు చేసే అద్భుతమైన ఆరోగ్య చిట్కా.. మీ కోసమే?

పొట్లకాయను తరచూ ఆహారంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వీటితో పొట్లకాయ కర్రీ, పొట్లకాయ వేపుడు, పొట్లకాయ బజ్జి వంటి అనేక రుచికరమైన వంటకాలను తయారు చేసుకొని తినొచ్చు. పొట్లకాయలో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోవియాల్ గుణాలు సమృద్ధిగా లభించడంతోపాటు క్యాల్షియం, ఐరన్, జింక్, అయోడిన్, పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి సహజ మినరల్స్ సమృద్ధిగా లభించి మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వారంలో ఒకటి లేదా రెండు సార్లు పొట్లకాయను ఆహారంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు పొట్లకాయను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పొట్లకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలు, సమృద్ధిగా లభిస్తాయి కావున మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా మనల్ని ఇబ్బంది పెట్టే దగ్గు , జలుబు, గొంతు నొప్పి, కడుపులో పుండ్లు వంటి అనేక అనారోగ్య సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. మన శరీరానికి అవసరమైన నీటి నిల్వలు పొట్లకాయలో సమృద్ధిగా లభించి శరీరంలోని చెడు లవణాలను బయటికి పంపడంలో సహాయ పడడమే కాకుండా శరీరంలోని ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించి డిహైడ్రేషన్ సమస్య నుంచి కూడా మనల్ని కాపాడుతుంది.

మన ఆరోగ్యాన్ని రక్షించడంలో పొట్లకాయ ఆకులు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. పొట్లకాయ ఆకులను బాగా మరిగించిన తర్వాత వచ్చే కషాయాన్ని వడగట్టుకుని అందులో కొంత కొత్తిమీర రసాన్ని కలుపుకొని సేవిస్తే కామెర్ల వ్యాధి నుంచి తొందరగా ఉపశయనం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నరాల బలహీనత సమస్యతో బాధపడేవారు కొన్ని నెలలపాటు ప్రతిరోజు పొట్లకాయ వేపుడు చేసుకొని తింటే వీటిలో సమృద్ధిగా లభించే మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు నరాల బలహీనతను తొలగిస్తుంది. మతిమరుపు సమస్యతో బాధపడేవారు పొట్లకాయను ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే అయోడిన్, జింక్ వంటి మూలకాలు జ్ఞాపక శక్తిని పెంపొందించి మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.