సాధారణంగా వృద్ధాప్యంలో కనిపించే తెల్ల జుట్టు సమస్య ఈ ఆధునిక జీవనశైలి ప్రారంభమైన తర్వాత 35, 40 సంవత్సరాలకే ప్రతి ఒక్కరు తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. తెల్ల జుట్టు సమస్యకు కారణాలు ఏవైనా కావచ్చు ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలామంది యువకులు మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ డ్రై ప్రొడక్ట్స్ ను విచ్చలవిడిగా వినియోగించి అనేక అలర్జీలను. చర్మ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఆయుర్వేద వైద్యంలో తెల్ల జుట్టు సమస్యకు సహజ పద్ధతిలో పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పరిష్కార మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకృతి సిద్ధంగా లభించే ఉసిరికాయ, గోరింటాకు తెల్ల జుట్టు సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతోంది. మీరు చేయవలసిందల్లా ముందుగా గోరింటాకును మెత్తటి మిశ్రమంగా మార్చుకొని అందులో ఉసిరికాయ పొడిని లేదా ఉసరి రసాన్ని కలిపి తరచూ తల వెంట్రుకల కుదుళ్లకు అంటే విధంగా రాసుకొని గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే వారంలో తెల్ల వెంట్రుకల సమస్య తొలగిపోయి నల్లని మెరిసే ఓత్తయిన వెంట్రుకలు మీ సొంతం అవుతాయి. ఉసరి,గోరింటాకులో ఉండే సహజ ఔషధ గుణాల బ్యాక్టీరియా వైరస్ ప్రభావాన్ని తగ్గించి చుండ్రు సమస్యను కూడా నివారిస్తాయి.
చిన్న వయస్సు లోనే తెల్ల జుట్టు, బట్టతల సమస్యతో బాధపడేవారు మెంతులను రాత్రంతా నానబెట్టి మెత్తటి మిశ్రమంగా మార్చుకున్న తర్వాత అందులో తగినంత బాదం నూనె కలిపి తల కుదురులకు అంటే విధంగా మెంతి మిశ్రమాన్ని అప్లై చేస్తే సహజ పద్ధతిలో తెల్ల వెంట్రుక సమస్యను తగ్గించుకోవచ్చు మరియు మెంతి గింజల్లో ఉండే ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని, చుండ్రు, తలలో పుండ్లు వంటి సమస్యను కూడా నివారిస్తుంది.