మీలో నీ నెగెటివ్ ఆలోచనలను తరిమికొట్టే అద్భుతమైన మార్గాలు!

istockphoto-1270842577-170667a

మనలో చాలామంది చిన్నచిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించి తీవ్ర భయాందోళనలకు గురవుతుంటారు.దీని కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళన, చిరాకు వంటి లక్షణాలతో ఎదుటి వారిపై తీవ్ర ఆగ్రహం , అసంతృప్తి వ్యక్తం చేస్తూ బందు మిత్రులకు దూరమవుతుంటారు. ఈ సమస్యలన్నిటికీ కారణం మీలో నెగటివ్ ఆలోచనలు శృతిమించుకోవడమే. మీరు ఎల్లప్పుడూ పాజిటివ్ ఆలోచనలతో సుఖ సంతోషాలతో జీవించాలి అంటే మీలోని నెగటివ్ ఆలోచనలను తొలగించుకోవాలి అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మన జీవన గమనంలో ఒడిదుడుకులు సర్వసాధారణం ఏది జరిగిన మన మంచికే అనుకొని పాజిటివ్ ఆలోచనలతో సాగిపోవాలి . అంతేకానీ జరిగిన దాని గురించి పదేపదే ఆలోచిస్తూ ఉండిపోతే మీలో నెగటివ్ ఆలోచనలు ఎక్కువై సమాజంలో మెలగడం కష్టమవుతుంది.

మొదట మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉండాలి. అప్పుడే ఎలాంటి సమస్యనైనా సులువుగా పరిష్కరించగలుగుతారు. అలా కాకుండా మీలోని నెగటివ్ ఆలోచనల కారణంగా మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీకు ప్రతి పనిలో ఓటమి ఎదురవుతుంది.

మీలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైనప్పుడు మీకు ఇష్టమైన సంగీతం వినడం, డాన్స్ చేయడం, ఆర్టికల్స్ చదవడం, ఇష్టమైన వ్యక్తులను కలవడం వంటి పనులు చేస్తే మీలో నెగటివ్ ఆలోచనలు తొలగి మానసిక ధైర్యం పెంపొందుతుంది. మీలో పాజిటివ్ ఆలోచన శక్తి పెంపొందాలంటే యోగ, ధ్యానం, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవాలి.

ఏ విషయాన్నైనా అతిగా ఆలోచిస్తే అందులోని లోపాలే ఎక్కువగా కనిపిస్తాయి దాంతో మీలో మానసిక ధైర్యం సన్నగిల్లి నెగటివ్ ఆలోచనలు ఎక్కువవుతాయి. చివరికి మన మీద మనకు నమ్మకం లేకుండా పోతుంది. కనుక కొన్ని విషయాలను దాని పరిధికి మించి ఆలోచించడం మంచిది కాదు.

ఎల్లప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మీలో ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీరు నిజాయితీగా చేసే ఏ పనిలోనైనా ఆనందాన్ని వెతుక్కుంటే మీలో పాజిటివ్ ఆలోచనలు పెరిగి నెగటివ్ ఫీలింగ్స్ తగ్గుతాయి.