ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కండరాలు పట్టేయడం లేదా కండరాల నొప్పి రావడం చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శక్తికి మించి వ్యాయామాలు చేయడం ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో కండరాలు పట్టేయడం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
కొన్నిసార్లు నొప్పితో కూడిన తిమ్మిరి లాంటి సమస్యలు వేధిస్తాయి. ఫిట్ గా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని చాలామంది భావిస్తారు. శక్తికి మించి వర్కౌట్లు చేస్తే కండరాలు పట్టేయడం జరుగుతుంది. హెవీ వర్కౌట్లు చేసిన సమయంలో చేతులు, కాళ్లను చాచడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. చల్లటి నీరు మీ కండరాలపై నొప్పి, వాపును తగ్గించి తేలికైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పవచ్చు.
గోరు వెచ్చటి నీరు రక్త ప్రసరణను ప్రోత్సహించడంతో పాటు కండరాలను సడలించడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన శీతల నీటితో స్నానం చేయడం ద్వారా కండరాలకు ఉపశమనం కలగడంతో పాటు అంతర్గతంగా కలిగే రక్తస్రావాన్ని ఆపడం సాధ్యమవుతుంది. యోగా, ధ్యానం, మ్యూజిక్ లాంటి థెరపీలతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ఛాన్స్ ఉంటుంది.
కార్బోహైడ్రేట్లు, తృణధాన్యాలు, ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా కండరాలు తిరిగి బలం పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. రాత్రి సమయంలో 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం ద్వారా ఆరోగ్యకరమైన నిద్రను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.