వేసవి కాలం మొదలైందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే రాయలసీమ జిల్లాలతో పాటు కొన్ని జిల్లాలలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చాలా మంది ఏసీలపై ఆధరపడుతూ ఉంటారు. అయితే ఏసీలు కూడా కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కాలంతో సంబంధం లేకుండా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.
ఉదయం లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఇండక్షన్ స్టవ్‌లు, వాషింగ్ మెషీన్లు, శుభ్రపరచడానికి ఉపయోగించే వాక్యూమ్ క్లీనర్‌ల వంటి వేడిని ఉత్పత్తి చేసే ఉపకరణాలను వాడితే మంచిది. లేత రంగు కాటన్ కర్టెన్లను వాడటం వల్ల వేడి గాలి ఇంట్లోకి వచ్చే అవకాశాలు అయితే తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. పడకలపై పడుకోవడం, సింథటిక్ ఫైబర్‌లతో తయారు చేసిన సీట్లపై కూర్చోవడం లాంటి పనులకు దూరంగా ఉండాలి.
చెక్క ఫర్నిచర్, పాత నోట్స్, వార్తాపత్రికలను తొలగించడం ద్వారా గదిని శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లోకి వేడి గాలి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇంట్లో అనవసరమైన లైట్లు లేదా బల్బులు వెలుగుతుంటే, లేదా కంప్యూటర్లు వంటి విద్యుత్ ఉపకరణాలు అనవసరంగా పనిచేస్తుంటే, వాటిని ఆర్పివేయాలి. సింథటిక్స్ బదులుగా కాటన్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రభావం పడదు.
నలుపు, ఎరుపు వంటి ముదురు రంగులు ఇంట్లోకి వేడిని ఆకర్షిస్తాయి కాబట్టి అలాంటి రంగులకు వీలైనంత దూరంగా ఉండాలి. మండే వేడిని నివారించడానికి తీగలు పెంచడం ఎంతగానో తోడ్పడుతుంది. కిటికీల బయట సన్ షేడ్స్ ఉంచడం వల్ల ఇంట్లోకి సూర్యకాంతి రాకుండా ఉంటుందని చెప్పవచ్చు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు టెర్రస్ మీద నీటిని పిచికారీ చేస్తే మంచిది.