Watermelon: పుచ్చకాయ ఫ్రిజ్లో పెట్టకూడదా.. పెడితే ఏం జరుగుతుందో తెలుసా!

వేసవికాలం వచ్చింది అంటే చాలు పుచ్చకాయలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. మనకు వేసవికాలంలో ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద పుచ్చకాయలు లభిస్తూ ఉంటాయి. వేసవిలో ఈ పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే మామూలుగా మనం పెద్ద పుచ్చకాయలు తెచ్చుకుంటే కొంచెం కోసి మిగతా సగాన్ని ఫ్రిజ్లో పెట్టడం చాలా మందికి అలవాటు. కొంతమంది మొత్తం కాయ అంత లోపల పెట్టేసి చల్లగా ఉన్నప్పుడు తింటూ ఉంటారు. మరీ ఫ్రిజ్లో పుచ్చకాయ పెట్టడం మంచిదో, కాదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పుచ్చకాయను ఫ్రిజ్లో పెట్టడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. పుచ్చకాయలో 90% నీరు ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఈ పండుని సరైన సమయంలో , సరైన పద్ధతిలో తినడం చాలా ముఖ్యం. లేదంటే ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. పుచ్చకాయను శీతలీకరించడం వల్ల దాని రుచి,నాణ్యత రెండింటినీ పాడు చేయవచ్చు. అంతే కాకుండా, పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం కూడా విషంగా మారే ప్రమాదం కూడా ఉంది. పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని పోషకాలు క్రమంగా తగ్గడం ప్రారంభిస్తాయి. అలాగే పుచ్చకాయను కోసి ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల విషపూరితంగా మారే ప్రమాదం ఉంది.

అలాగే, కోసిన పుచ్చకాయపై బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. అవి సాధారణంగా మన శరీరానికి హానికరం. గది ఉష్ణోగ్రత వద్ద పుచ్చకాయలను ఉంచడం ఉత్తమం. తద్వారా దాని ప్రయోజనాలను పూర్తిగా ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా రాత్రి పూట పుచ్చకాయ తినకూడదు. ఇది ఎల్లప్పుడూ పగటిపూట మాత్రమే తినాలి. అలాగే దీన్ని తిన్న తర్వాత నీళ్లు, పాలు, లస్సీ, శీతల పానీయాలు వంటివి తీసుకోకూడదు. పుచ్చకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. ఇది తిన్న తర్వాత కూడా ఎక్కువసేపు ఆకలిని నివారిస్తుంది. పుచ్చకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా.. ఈ ఎండా కాలంలో మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలోనూ సహాయపడుతుంది.