ముఖం నల్లగా మారిపోతుందా.. ఈ చిట్కాలు పాటించకపోతే ప్రమాదమంటూ?

ఈ మధ్య కాలంలో చాలామందిని అరుదైన ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆహారపు అలవాట్లకు సంబంధించి చేస్తున్న తప్పులు, ఇతర కారణాల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖం నల్లగా మారుతున్నా అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం అని చెప్పవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు సులువుగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

ముఖం రోజురోజుకు నల్లగా మారుతుంటే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆ సమస్య దూరమవుతుంది. ముఖం నల్లగా మారుతుంటే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ముఖాన్ని రెండుసార్లు శుభ్రపరచుకోవాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా చర్మం నల్లబడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. తాజా పండ్ల రసాలను తాగడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

బయటకు వెళ్లే వాళ్లు సన్ స్క్రీన్ లోషన్ ను వాడటం ద్వారా ముఖం కాంతివంతంగా మెరిసేలా జాగ్రత్త పడవచ్చు. దానిమ్మ, ద్రాక్ష, పుచ్చాకాయ తినడం ద్వారా ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. తేనె, ద్రాక్ష గుజ్జు ముఖానికి రాసుకోవడం ద్వారా నల్లగా ఉన్నవాళ్లు తెల్లగా మారే అవకాశం ఉంటుంది. మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఎండలో ఎక్కువగా తిరిగినా చర్మం రంగులో మార్పులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో దొరికే కాస్మొటిక్ ఉత్పత్తుల ద్వారా కూడా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలు పాటించినా ఫలితం లేకపోతే వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.