అమ్మాయిలకు అలర్ట్.. ఈ టాబ్లెట్ ను ఎక్కువగా వాడితే ప్రమాదంలో పడతారంటూ?

మనలో చాలామంది ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం టాబ్లెట్లపై ఆధారపడుతూ ఉంటారు. కొంతమంది వైద్యుల సలహాలను పాటించి టాబ్లెట్లను వాడితే మరి కొందరు మాత్రం వైద్యుల సలహాలు కూడా తీసుకోకుండా టాబ్లెట్లను వినియోగిస్తూ ఉంటారు. అయితే టాబ్లెట్లను ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అయితే అమ్మాయిలు మెఫ్టాల్ అనే టాబ్లెట్ ను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. పీరియడ్స్ పెయిన్ ను తగ్గించడం కోసం ఈ టాబ్లెట్ ను ఉపయోగిస్తారు. అయితే ఈ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని ఇండియన్ ఫార్మా కమిషన్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడటం వల్ల డ్రెస్ సిండ్రోమ్ లాంటి తీవ్రమైన అలర్జీల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అదే సమయంలో పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను ఎక్కువగా వాడటం వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం చూపడంతో పాటు ఎసిడిటీ సమస్యకు కారణమవుతాయి. పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల వల్ల కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది.

పెయిన్ కిల్లర్ లను ఎక్కువగా తాగడం వల్ల యాంటీ రెసిస్టెన్స్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మెఫ్టాన్ ట్యాబ్లెట్ ను ఉపయోగించిన వాళ్లు ఇకపై ఆ ట్యాబ్లెట్ ను వాడకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. అమ్మాయిలు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.