ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడుపుతున్నారా.. ఈ ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం?

మనలో చాలామంది ఎక్కువ సమయం ఏసీ గదులలో గడపటానికి ఇష్టపడతారు. ఏసీ గదులలో ఉండటం ద్వారా ప్రశాంతంగా నిద్రపోవచ్చని భావిస్తారు. హోటళ్లలో సైతం ఏసీ ఉన్న గదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఏసీలో ఎక్కువగా ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఏసీలో ఎక్కువ సమయం ఉండటం వల్ల గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.

ఏసీలో ఎక్కువ సమయం గడిపే వాళ్లు బయటకు వెళ్లిన సమయంలో విపరీతమైన అలసట, బలహీనతతో బాధ పడే అవకాశం ఉంటుంది. తక్కువ చల్లదనంలో ఏసీని వాడటం మంచిది. ఏసీలో ఎక్కువ సమయం జీవించే వాళ్లు తలనొప్పి, మైగ్రేన్ సమస్యలతో బాధ పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏసీలో ఎక్కువ సమయం గడిపే వాళ్లు డీ హైడ్రేషన్ కు గురై తలనొప్పితో ఎంతో బాధ పడే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఏసీలో ఎక్కువ సమయం గడిపే వాళ్లు పొడి చర్మం సమస్యతో బాధపడే అవకాశాలు అయితే ఉంటాయి. ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల కళ్లు పొడిబారతాయని చెప్పవచ్చు. ఏసీలో ఎక్కువ సమయం ఉండటం వల్ల ఆస్తమా, అలర్జీ సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. భరించలేని తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ వంటి లక్షణాలు ఏసీ వల్ల రావడంతో పాటు కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవ్వాల్సి ఉంటుంది.

ఎయిర్ కండిషన్ నుంచి వచ్చే చల్లదనం వల్ల చర్మం ముడతలు పడి చర్మం తేమను కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువసేపు ఏసీలో ఉంటే మైగ్రేన్ వస్తుందని చెప్పవచ్చు. చర్మంలో కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల ఏసీ శరీరంపై ఎఫెక్ట్ ను చూపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.