సీజనల్ మరియు దీర్ఘకాలిక వ్యాధులను సైతం అదుపు చేసే అద్భుత ఫలం?

శీతాకాలం ప్రారంభం అవడంతో సర్వసాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం మరియు దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ , హైబీపీ, గుండెపోటు, క్యాన్సర్, థైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవాలన్న, సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందాలన్నా ప్రధమంగా మనలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడమే ఉత్తమైన మార్గం. ఇందుకోసం శారీరక శ్రమ కలిగిన నడక ,వ్యాయామం అలవాటు చేసుకోవాలి.

ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొంది అధిక పోషకాల గనిగా పిలవబడే కివి పండ్లు ను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ శక్తిని పెంపొందించుకోవడంతోపాటు అనేక దీర్ఘకాలిక వ్యాధులను అదుపు చేయడంలో సహాయపడుతుంది.
ఎలాగో ఇప్పుడు చూద్దాం. కివి పండ్లలో రక్తం గడ్డకట్టకుండా నివారించే యాంటిథ్రోంబోటిక్ సమృద్ధిగా
ఉండడంవల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర సమస్యలను అధిగమించవచ్చు.

కివి పండ్లలో పుష్కలంగా పొటాషియం, క్యాల్షియం,
ఫోలేట్, ఫైబర్, సోడియం, రాగి వంటి మూలకాలు లభిస్తాయి. వీటిని ప్రతిరోజు మన ఆహారంలో తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిని పెంచడానికి
సహాయపడి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేసి నీరసం ,అలసట వంటివి తొలగించి రోజంతా ఉత్సాహంగా ఉండునట్లు చేస్తుంది.కివి పండ్లలో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది.

కివి పండ్లలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,
యాంటీ బ్యాక్టీరియల్ ,వైరల్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన చెడు మలినాలను తొలగించి అనేక క్యాన్సర్ కారకాల నుంచి రక్షణ కల్పిస్తుంది. వీటిలో అధికంగా ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి హైబీపీ సమస్యను అదుపులో ఉంచుతుంది. కివి పండ్లను సమృద్ధిగా ఉన్న పీచు పదార్థం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కివి పండ్లు ను మరి ఎక్కువగా తింటే మన శరీరం పై వ్యతిరేక ప్రభావాన్ని చూపించవచ్చు.