గుండెపోటు మరణాలకు అసలు కారణం ఇదే.. డబ్ల్యూహెచ్ఓ సంచలన వ్యాఖ్యలు!

11_07_2022-heart-attack-symptoms_22881533

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. యువత ఎక్కువగా గుండెపోటు బారిన పడుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా గుండె సంబంధిత వ్యాధులు, మరణాలు పెరుగుతున్నాయి. గుండెపోటు మరణాల గురించి డబ్ల్యూహెచ్ఓ తాజాగా కీలక ప్రకటన చేయగా ఆ ప్రకటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

గుండెజబ్బును, గుండెజబ్బు లక్షణాలను ముందుగానే గుర్తిస్తే హార్ట్ ఎటాక్ రాకుండా రక్షించుకోవచ్చు. ఉప్పు ఎక్కువగా వాడటం వల్లే గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉప్పు వినియోగం పెరిగితే ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

2023 సంవత్సరం నాటికి ఉప్పు వినియోగం తగ్గించని పక్షంలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే వాళ్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరగనుంది. ముందుగానే జాగ్రత్త పడితే 80 శాతం మంది గుండె సంబంధిత సమస్యల నుంచి, మరణాల నుంచి తప్పించుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూత్రాలను ఉప్పు విషయంలో చాలా దేశాలు పట్టించుకోవడం లేదు.

రోజుకు 5 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాల్సి ఉండగా చాలామంది ఎక్కువ మొత్తం ఉప్పును తీసుకుంటున్నారు. ఉప్పు వినియోగం విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం ఆరోగ్యానికి సంబంధించి నష్టం చేకూరుస్తోంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్లు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.