మనలో చాలామంది రుద్రాక్ష ధరించడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. రుద్రాక్ష ధరించడం వల్ల మానసికంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది భావిస్తారు. రుద్రుడి నుంచి రాలిన కన్నీటి చుక్కలు రుద్రాక్షలుగా మారాయని చాలామంది నమ్ముతారు. శివుని ప్రతిరూపాలుగా చాలామంది రుద్రాక్షలను కొలుస్తారు. నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటే అలాంటి వాళ్లు రుద్రాక్షలను ధరిస్తే మంచిది.
రుద్రాక్ష ధరించడం వల్ల మనకు ఉన్న కష్టనష్టాలు సైతం తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. రుద్రాక్ష వృక్షాలు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటంతో పాటు ఈ వృక్షాలు చాలా ఖరీదైనవి కావడం గమనార్హం. ఎవరైతే రుద్రాక్ష మాలను ధరిస్తారో వాళ్లు మైల పడిన వాళ్లను తాకకూడదు. రుతు సమయంలో స్త్రీలు రుద్రాక్ష మాలకు దూరంగా ఉంటే మంచిది.
రుద్రాక్ష మాలను ధరించి నిద్రపోవడం ఉంగరంలా రుద్రాక్షమాలను ధరించడం చేయకూడదు. ఒకరు వాడిన రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు. ఎవరైతే రుద్రాక్ష మాలను ధరిస్తారో వాళ్లు శ్మశానానికి వెళ్లకూడదు. ఎవరైతే ఏకముఖి రుద్రాక్షను ధరిస్తారో వాళ్లపై దుష్టశక్తుల ప్రభావం ఉండదు. ఈ రుద్రాక్షను ధరిస్తే ఆర్థిక స్థిరత్వం పొందే అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలిక వ్యాధులను, మానసిక వ్యాధులను తగ్గించడంలో రుద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడతాయనే సంగతి తెలిసిందే. రుద్రాక్షలను ధరించడం వీలు కాని పక్షంలో పూజగదిలో ఉంచి రుద్రాక్షలను పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.