సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే నరాల బలహీనత, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ప్రస్తుత రోజుల్లో యుక్త వయసులోనే ఎక్కువ మందిని వేధిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, నియమ నిబంధనలు లేని ఆహారపు అలవాట్లే కారణమని చెప్పొచ్చు. నరాల బలహీనత కారణంగా నరాల వాపు, తీవ్రమైన నొప్పి సమస్యలతో ప్రతిరోజు బాధపడాల్సి వస్తుంది.
ముఖ్యంగా శీతాకాలంలో నరాల బలహీనత సమస్యతో బాధపడేవారు నరాలు ,కండరాలు బిగుసుకుపోవడం వల్ల కూర్చుని లేవలన్నా, పని చేయాలన్నా, నాలుగడుగులు వేయాలన్న తీవ్రమైన నొప్పి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. నరాల పనితీరును మెరుగుపరుచుకోవడానికి మన ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఈ నరాల సమస్య దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి.
నరాల బలహీనత సమస్య ఉన్నవారు ప్రతిరోజు కొన్ని వ్యాయామాలు, యోగా వంటివి చేస్తూ ఇప్పుడు చెప్పబోయే కషాయాన్ని నెలరోజుల పాటు సేవిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించాలి కొద్దిసేపటి తర్వాత అత్యధిక ఔషధ గుణాలున్న దాల్చిన చెక్క ని వేసి మరి కొంతసేపు బాగా మరిగించిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వడగట్టుకుని ప్రతిరోజు సేవిస్తే మెంతులు దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలు శరీరంలో ఉన్న వ్యాధి కారకాలను చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.
దాల్చిన చెక్క మెంతుల కషాయాన్ని ప్రతిరోజు సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ మైక్రోబియన్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి శరీరంలో చెడు మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్తప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. నరాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థ సాఫీగా అయ్యేటట్టు చేయడమే కాకుండా నరాల వాపు, నరాలు కుషించుకుపోవడం వంటి లక్షణాలను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.