దేశంలో చాలామంది కళ్ల కింద ఉన్న డార్క్ సర్కిల్స్ వల్ల నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య కొంతమందిలో ఆత్మనూన్యతకు కారణమవుతోంది. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కళ్ల కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. కళ్ల కింద నల్లటి వలయాలకు ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు ఇలా వేర్వేరు కారణాలు ఉంటాయి.
సౌందర్య ఉత్పత్తులను వాడటం ద్వారా ఈ సమస్యకు తాత్కాలికంగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. చర్మంపై మచ్చలను తొలగించి, మెరిసేలా చేయడంలో టమాటాలు తోడ్పడతాయి. స్పూన్ టమాటా జ్యూస్‌కు నిమ్మరసం కలిపి కళ్ల కింద రాసుకుంటే మంచిది. రోజుకు రెండుసార్లు ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. బంగాళదుంపలను సన్నగా తరిగి జ్యూస్ చేసుకుని దూదిని ఆ జ్యూస్ లో ముంచి నల్లటి వలయాలను కవర్ చేసేలా జాగ్రత్త పడితే మంచిది.
గ్రీన్ టీ బ్యాగ్‌లను నీటిలో ముంచి ఫ్రిజ్ లో ఉంచి దాన్ని కళ్లపై ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆల్మాండ్ ఆయిల్‌లో విటమిన్-ఇ ఎక్కువగా ఉండగా ఈ నూనెను నల్లటి వలయాలపై రాసి మెల్లగా మసాజ్ చేస్తే మంచిది. చల్లటి పాలలో దూదిని ముంచి కాసేపు ఉంచి కళ్లు, నల్లటి వలయాలున్న ప్రాంతాన్ని కవర్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
ఈ విధంగా చేయడం ద్వారా నల్లటి వలయాలకు చెక్ పెట్టవచ్చు. ఆరెంజ్ జ్యూస్‌లో కొద్దిగా గ్లిజరిన్ కలిపి నల్లటి వలయాలు ఉన్న చోట పూయడం ద్వారా కూడా డార్క్ సర్కిల్స్ దూరమవుతాయి. ఒత్తిడి, డిప్రెషన్, జీవన శైలిలో మార్పుల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. రెగ్యులర్‌గా యోగా చేయడం వల్ల జీవ గడియారం బ్యాలెన్స్‌గా ఉండి డార్క్ మార్క్స్ తగ్గుతాయి.