చేతి న‌రాల‌తో నాలుక.. డాక్టర్ల సృష్టి మాములుగా లేదుగా…?

ప్ర‌స్తుతం తినే తిండి లోప‌మో లేక వాతావ‌ర‌ణ కాలుష్య‌మో తెలియ‌దు కానీ మ‌నిషి వివిధ ర‌కాల జ‌బ్బుల‌తో ఇబ్బందుల పాల‌వుతున్నారు. యూకేలోని బకింగ్హామ్‌షైర్‌‌లో గల ఇల్సుబ్యూరీ ప్రాంతానికి చెందిన స్టెఫానీ విగ్లెస్వర్త్ అనే మహిళకు నోటిలో అల్సర్ ఏర్పడింది. అంటే దానిని నోటి క్యాన్స‌ర్ అని కూడా చెప్ప‌వ‌చ్చు. చికిత్సలో భాగంగా వైద్యులు ఆమె నాలుకలో సగ భాగాన్ని తొలగించారు. దీంతో ఆమె ఇకపై మాట్లాడలేనని భావించింది. అయితే, వైద్యులు చెప్పింది విని ఆమెలో ఆశలు చిగురించాయి. ఆమెకు చెప్పినట్లే వైద్యులు.. ఆమె నాలుకను తిరిగి సృష్టించగలిగారు. ఆమె చేతి కండరాలనే నాలుకగా మలచి.. ఆమెకు తిరిగి మాటలు వచ్చేలా చేశారు.

నాలుక మొదలు నుంచి గొంతు భాగం వరకు ఉండే భాగాన్ని తొలగించాలని చెప్పారు. తొలగించిన నాలుక భాగంలో చేతి కండరాలను అమర్చడం ద్వారా నాలుకను తిరిగి పొందవచ్చని తెలిపారు. ఇది క్లిష్టమైన ప్రక్రియ అని తెలిసినా.. స్టెఫానీ వద్ద మరో మార్గం లేదు. వైద్యులపై నమ్మకం ఉంచి సర్జరీకి సిద్ధమైంది.

సర్జరీలో భాగంగా వైద్యులు ఆమె నాలుకలో సగ భాగాన్ని తొలగించారు. ఆ స్థానంలో ఆమె చేతి కండరాలను తీసి అతికించారు. ప్రస్తుతం స్టెఫానీ ద్రవ రూపంలో ఆహారాన్ని తీసుకుంటుంది. నాలుకకు సమస్య లేకుండా స్ట్రా ద్వారా తాగుతోంది. మాట్లాడటానికి ఇబ్బంది పడుతోంది. ‘‘నా నాలుక కంటే.. కండరాలను తొలగించిన చేతి భాగమే ఎక్కువగా నొప్పి వస్తోంది. నా మాట తిరిగి వస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపింది.

ఇక ఈమెకి ఈ వ్యాధి సోక‌డానికి ప్ర‌ధాన కార‌ణం స్మోకింగ్ అని తెలిసింది. స్మోకింగ్‌ వల్లే ఈ సమస్య: ‘‘నేను స్మోకర్‌ను. ఈ దుర‌లవాటు వల్ల ఈ వ్యాధి రావడం సబబే అనుకున్నా. కానీ, నాకు నా పిల్లలతో కలిసి ఉండాలని ఉంది. అదే నాలో పట్టుదలను పెంచింది. నేను తిరిగి కోలుకుంటానని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు క్యాన్సర్ పూర్తిగా నయమైంది’’ అని స్టెఫానీ తెలిపింది. ఏ అల‌వాటు కూడా ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు. వాటి వ‌ల్ల మ‌నం కోల్పోయేది కేవ‌లం మ‌న ఆరోగ్య‌మే కాదు. మ‌న బంధాలు అనుబంధాలు కూడా వాటి చుట్టూ ఉంటాయి.