ఆల్కహాల్ పార్టీ …’ఇస్మార్ట్’ హీరోయిన్ కు దెబ్బ కొట్టింది?

ఆల్కహాల్ పార్టీ …’ఇస్మార్ట్’ హీరోయిన్ కు దెబ్బ కొట్టింది?

టాలీవుడ్ లో ఊరమాస్ చిత్రంగా వచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ భాక్సాఫీస్ వద్ద నాటౌట్ అంటూ కలెక్షన్స్ పరుగులు తీస్తోంది. దాంతో టీమ్ అంతా సెలబ్రేషన్స్ మూడ్ లో ఉన్నారు. అంతేకాదు సినిమాని ఎగ్రిసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు ఆగలేదంటే టీమ్ ఉత్సాహంగా చేస్తున్న ప్రమోషన్సే కారణం. విడుదలైన 16 రోజుల తర్వాత కూడా ఈ చిత్రం కలెక్షన్లు చూస్తుంటే ట్రేడ్ డా షాక్ అవుతోంది. రామ్ కెరీర్‌లో తొలి 75 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది ఈ చిత్రం.

ఇక ఈ చిత్రం సెలబ్రేషన్స్ లో పూరి జగన్నాథ్, ఛార్మి, నిధి అగర్వాల్ పాల్గొంటున్నారు. తెలంగాణా, ఆంధ్రాలో టూర్స్ వేస్తున్నారు. మొదట సీన్ లోకి లేకపోయినా ఈ టీమ్ తో వచ్చి కలిసాడు రామ్. అయితే అంతా బాగానే ఉన్నా హీరోయిన్ నభా నటేష్ మాత్రం ప్రమోషన్స్ లో కనపడటం లేదు. దాంతో ఆమె అలిగిందని, టీమ్ తో గొడవలు అయ్యాయని మీడియా లో టాక్ మొదలైంది. మరికొందరు మాస్ రాజా రవితేజ తాజా చిత్రం డిస్కోరాజా చిత్రం షూటింగ్ లో బిజీగా ఉందన్నారు. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది.

పార్టీ సందర్బంగా తీసుకున్న ఆల్కహాల్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆమెపై పడిందని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ తో ఆ రోజు రాత్రి బీర్ పార్టీ జరిగాక..తెల్లారి నభా సిక్ అయ్యిందిట. పూర్తి ఫీవర్ తో బెజడ్ ఎక్కిందిట. దాంతో టీమ్ అంతా ఎంజాయ్ చేస్తూ టూర్స్ వేస్తూంటే తను మాత్రం జ్వరంతో వచ్చిన నీరసంతో రెస్ట్ తీసుకుందిట.