నటి రష్మిక మందన్న ప్రస్తుతం ఇలాంటి నిరాశకు గురైందని సమాచారం. మాతృభాష కన్నడలో కూడా లేనంత క్రేజ్‌ను తెలుగు సినీ పరిశ్రమ తెచ్చి పెట్టింది. తెలుగులో ‘గీత గోవిందం’ సంచలన విజయంతో రాత్రికి రాత్రే స్టార్ అయింది రష్మిక. ఆ తర్వాత మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’లో నానితో జత కట్టింది. ఆ చిత్రం ఓకే అనిపించింది. ఇక రెండోసారి విజయ్‌దేవరకొండతో రొమాన్స్ చేసిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం విడుదలకు ముందు పెద్ద హైప్‌ను క్రియేట్ చేసినప్పటికీ హిట్ రేంజ్‌కు చేరలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. అయితే అంతకు ముందు ఉన్న క్రేజ్‌తో మహేశ్‌బాబుతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆయనతో కలిసి భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తోంది.ఇకపోతే తమిళంలోనూ ‘గీత గోవిందం’ తెచ్చి పెట్టిన పాపులారిటీతోనే కార్తీతో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది. భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా అంతకు ముందే విజయ్ సరసన నటించే అవకాశం ఈ అమ్మడి కోసం ఎదురు చూస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఆగండయ్యా ఇంకా కన్ఫార్మ్ కాలేదు అంటూ చిరు కోపంతో వారిని కట్డడి చేసింది. దీంతో విజయ్‌కు జంటగా నటించే చిత్రం గురించి చర్చలు జరుగుతున్నట్లు రష్మిక మీడియాకు వెల్లడించింది. అలాంటిది విజయ్ 64వ చిత్రంలో నటి కియారా అద్వానీ నటించనున్నట్లు తాజా సమాచారం. తెలుగు, హిందీ భాషల్లో హిట్స్‌ను అందుకుంటున్న కియారా ప్రస్తుతం బిజీగానే ఉంది.
రష్మికకు కి వార్నింగ్ ఇచ్చిన కియారా !
