‘గరుడవేగ’ హిట్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన యాంగ్రీమెన్ రాజశేఖర్ తాజాగా చేస్తున్న చిత్రం ‘కల్కి’. నాని నిర్మించిన అ! సినిమాతో తన సత్తా చాటుకున్న యంగ్‌డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీకి సంబంధించి కమర్షియల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ట్రైలర్ చూసిన వారంతా రాజశేఖర్ కు మరో హిట్ గ్యారెంటీ అనేసారు. దానికి తగినట్లే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సాగింది. ఈ సినిమా రిలీజ్ తేదీ మే 31 అంటూ ఫిక్స్ చేశారు. కానీ ఇంతలోనే అనూహ్యంగా సినిమాని వాయిదా వేశారు. అందుకు కారణం ..ఓ డబ్బింగ్ సినిమా అని తేలటం అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఆ సినిమా మరేదో కాదు సూర్య హీరోగా నటించిన ఎన్ జీకే. ఓ డబ్బింగ్ సినిమా కోసం స్టైయిట్ గా రిలీజ్ చేసే సినిమా రిలీజ్ వాయిదా వేస్తారా అంటే వాళ్ల లెక్కలు వాళ్లకు ఉన్నాయిట. కల్కి సినిమాకు, ఎన్ జీ కే సినిమా రెండింటిని రిలీజ్ చేయబోయేది ప్రముఖ నిర్మాత రాధామోహన్ . ఈ రెండు చిత్రాల రైట్స్ ఆయన దగ్గరే ఉన్నాయి. దాంతో తన సినిమాపై తనే పోటీ కు వెళ్లే పరిస్దితి లేదు. దాంతో ఏదో ఒక సినిమాని వాయిదా వేయాలి. అదే విషయం చెప్తే తమిళ నిర్మాతలు వినరు.
ఎన్ జీకే సినిమాను వాళ్లు రిలీజ్ డేట్ ఇచ్చేసారు. తమిళం వాళ్లకు మెయిన్ ప్రయారిటీ. తెలుగు అనేది కేవలం ఓ మార్కెట్ అంతే . దాంతో వాళ్లు రిలీజ్ డేట్ ఎట్టి పరిస్దితుల్లోనూ మార్చరు. కల్కి చిత్రం అయితే తన చేతిలో ఉంది. అందుకే కల్కిని ఆపి ఎన్ జీకే ని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రాజశేఖర్ కు చాలా కోపం వచ్చిందిట. ఇలా చివరి నిముషాల్లో రిలీజ్ డేట్స్ ఛేంజ్ చేస్తే ఇబ్బంది అని, ఖచ్చితంగా ప్రాజెక్టుపై ఇంపాక్ట్ చూపెడుతుందని చెప్పాడట. కానీ నిర్మాత తన లాజిక్ లతో రాజశేఖర్ కు ఆన్సర్ ఇచ్చారట. వేరే దారిలేక రాజశేఖర్ సైలెంట్ అయ్యాడట.
ఆదాశర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు.