అగ్ర హీరో వెంకటేశ్ తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు. రాయలసీమలో ఈ సినిమా ఎక్కువ శాతం చిత్రీకరణ జరగనుందని సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది.
కలైపులి యస్.థాను, సురేశ్‌బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని తెలిసింది. ఈ సినిమాను ఎక్కువగా అనంతపురం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారట. ఇందులో వెంకటేశ్ భార్యగా ప్రియమణి కనిపించనున్నారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రతీకార కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. మార్చి నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తి చేసి వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘అసురన్’ పై వెంకటేశ్ కు ఆశలెన్నోఉన్నాయి. ఈ చిత్రం తో తన కెరీర్ మరో కొత్త మలుపు తిరగడం ఖాయం అని చెబుతున్నారు.
