‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిరంజీవి గారితో వర్క్ చేయడం మైండ్-బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్: డైరెక్టర్ అనిల్ రావిపూడి

Mana Shankara Vara Prasad Garu Movie: మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ గారు చిత్రాన్ని అభినందించారు.. ఎలా అనిపించింది ?

-కళ్యాణ్ గారు అభినందించడం చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే ఇండస్ట్రీలో డైరెక్టర్స్, హీరోస్ చాలామంది పర్సనల్ గా ఫోన్ చేశారు, మెసేజ్లు పెట్టారు. ఈ సక్సెస్ ని మాతో పాటు ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.

ఈ సినిమాలో చిరంజీవి గారు యంగ్ స్లీక్ లుక్ లో కనిపించారు కదా.. మీరు క్యారెక్టర్ చెప్పినప్పుడే ఇలా అనుకున్నారా?

-ఈ సినిమా కోసం ఆయనకి ఫస్ట్ ఫోటో షూట్ చేయగానే లుక్ చూసి స్టన్నింగ్ గా అనిపించింది. ఈ లుక్కు చాలా వావ్ ఫ్యాక్టర్ల ఉండబోతుందనిపించింది. చాలా గ్లామర్ గా ఉన్నారు. సన్నబడిపోయారు. ఈ లుక్కు సినిమా అంతా ఉంటే ఆడియన్స్ ఈ లుక్ కి ఫిదా అయిపోతారు అనిపించింది. ఆయన లుక్కు, స్క్రిప్ట్, టైమింగ్, బాడీ లాంగ్వేజు అన్నీ కుదిరాయి, వింటేజ్ చిరంజీవి గారిని చూసి అందరూ మెస్మరైజ్ అయ్యారు. వింటేజ్ మెగాస్టార్ ని చూపించే అవకాశం నాకు ఇచ్చినందుకు చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

-చిరంజీవి గారికి నేచురల్ గా ఒక టైమింగ్ ఉంటుంది. అలాంటి కథతో ఆయన ప్రజెంట్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుందని అనిపించింది. ఈ రోజు అదే జరిగింది. అన్ని జనరేషన్ ఆడియన్స్ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు.

చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఒకే సినిమాతో తీసుకొచ్చారు కదా.. ఆ ఒత్తిడి మీద ఉండేదా?

-చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి కనిపించబోతున్నారంటే కచ్చితంగా చాలా అంచనాలు ఉంటాయి. అందరికీ నచ్చేలా ప్రజెంట్ చేయడం కూడా పెద్ద టాస్క్. అయితే చిరంజీవి గారు వెంకటేష్ గారి మధ్య ఉన్న నేచురల్ ఫ్రెండ్షిప్ వల్ల నా వర్క్ ఈజీ అయింది. థియేటర్స్ లో చిరంజీవి గారు వెంకటేష్ గారి సీన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

-చిరంజీవి గారితో పనిచేయడం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఆ ఇద్దరు స్టార్స్ ని చూస్తూ పెరిగాను. వాళ్ళని డైరెక్ట్ చేయడం ఒక డ్రీమ్. వాళ్లని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేయడం అనేది మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ ఇద్దరితో కలిసి డాన్స్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. చిరంజీవి గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. బెల్ట్ స్టెప్ ని పర్ఫెక్ట్ గా చేయమని ఎంకరేజ్ చేశారు. ఆ సీక్వెన్స్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఇందులో ప్రతి సీక్వెన్స్ అద్భుతంగా వర్కౌట్ అయింది కదా.. రైటింగ్ రైటింగ్ ప్రాసెస్ ఎలా సాగింది?

-శంకర్ వరప్రసాద్ క్యారెక్టర్ జర్నీ చూపిద్దాం అనుకున్నాను. సినిమా వన్ మ్యాన్ షోలా అనిపిస్తుంది. ప్రతి సీను ఆయన చుట్టూ చుట్టూతనే వెళ్ళాం. నేను ఏ స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నాను దాని ప్రకారం చేయడం జరిగింది. అయితే శశిరేఖ లవ్ ట్రాక్ మాత్రం ముందు స్క్రిప్ట్ లో మధ్యలో వస్తే బాగుంటుంది అనుకున్నాను. కానీ స్క్రీన్ ప్లే ప్రకారం అది బిగినింగ్ వస్తేనే ఇంకా కనెక్టింగ్ గా ఉంటుందని దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఇంకా అద్భుతంగా వర్క్ అయ్యింది.

మందు కొట్టే సీన్ చాలా వైరల్ అయింది కదా.. దాని గురించి చెప్పండి?

-చిరంజీవి గారి ప్రతి సినిమాలో అలాంటి ఒక పెక్యులర్ సీక్వెన్స్ ఉంటుంది. మందు సీన్స్ లో ఆయన చేసే మ్యానరిజమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ సీక్వెన్స్ వెంకటేష్ గారికి ఆయనకి మధ్య ఉండే కనెక్షన్ ని కూడా రివిల్ చేస్తుంది. అది థియేటర్లో అద్భుతంగా పేలింది. ఇప్పుడు అందరు సరదాగా రీల్స్ చేస్తున్నారు. అయితే సినిమాలో ఏదో సరదాకి చేస్తాం. పిల్లలు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుతున్నాను.

చిరంజీవి గారికి కథ చేయడంలో చాలా కష్టం ఉంటుంది కదా.. ఆయనకి ఈ కథ చేసినప్పుడు మీ ప్రిపరేషన్ ఏమిటి?

-చిరంజీవి గారితో కచ్చితంగా సినిమా చేయాలనే కాన్ఫిడెన్స్ తో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఈ కథని సిద్ధం చేశాను. చిరంజీవి గారిని నాకు నచ్చినట్టు చూపించాలనే తపన ఏమో కానీ రైటింగ్ అంతా చాలా స్మూత్ గా వెళ్ళింది. మేము అనుకున్నవన్నీ చక్కగా కుదిరాయి. ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చింది కూడా చిరంజీవి గారే. నా కెరీర్ లో చాలా ఫాస్ట్ గా రాసిన స్క్రిప్ట్ ఇది. ఇలాంటి పాత్రలు ఆయనకి కొట్టినపిండి. ఆయన టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి కామెడీ సీన్స్ చేస్తున్నప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది.

నయనతార గారు స్పెషల్ గా మీ సినిమా కోసం ప్రమోషన్ చేశారు.. అది ఎలా కుదిరింది?

ఈ సినిమా కథ తనకు చాలా నచ్చింది. అలాగే నా వర్కింగ్ స్టైల్ కూడా నచ్చింది .బహుశా నేను ఇలాగే చేస్తానేమో అని చాలా పాజిటివ్ గా తీసుకుని ప్రమోషన్స్ లో కూడా భాగమవడం జరిగింది. రిలీజ్ నయనతార గారితో మాట్లాడాను. ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు తను చాలా ఆనందంగా ఉన్నారు.

గ్రౌండ్ లెవెల్ లో మీరు చాలామంది మెగా అభిమానుల్ని కలిశారు కదా ..వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి?

-అభిమానుల రెస్పాన్స్ మాటల్లో చెప్పలేను. నన్ను చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి గారిని ఇలా చూడాలని వాళ్లు కోరుకున్నారు. ఈ సక్సెస్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. థియేటర్స్ లో ఆడియన్స్ ని చూస్తున్నప్పుడు ఒక జాతర లాగా అనిపించింది. అన్ని ఏజ్ గ్రూప్ ప్రేక్షకులు ఈ సినిమాని సెలెబ్రేట్ చేసుకున్నారు.

రాజమౌళి గారి తర్వాత వరుసగా తొమ్మిది విజయాలు అందుకున్న దర్శకుడిగా రికార్డు సృష్టించారు.. మీ పదో సినిమాకి ఎంత జాగ్రత్త తీసుకోబోతున్నారు ?

-నిజానికి ఇది నాకు కాస్త కృషియల్ ఫేజ్. నెక్స్ట్ ఏం చేయాలనే దానికి గురించి ఒక రెండు పాజ్ ఇచ్చాను. మొన్న ఒక ఐడియా క్రాక్ చేసాము. ఈసారి టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఒక విచిత్రమైన జర్నీ స్టార్ట్ కాబోతోంది. స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యాను. ఇంకా యాక్టర్స్ ఫిక్స్ కాలేదు. జూన్, జూలైలో స్టార్ట్ చేయాలి. అది కూడా మంచి ఎంటర్టైనర్. నెక్స్ట్ సంక్రాంతికి వస్తారా? అని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు(నవ్వుతూ).

సినిమాకి యుఎస్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా అక్కడికి టూర్ కి వెళ్ళే అవకాశం ఉందా ?

యూఎస్ వెళ్లాలి. ఫిబ్రవరిలో, లేదా ఈ నెల చివర్లో గాని అక్కడికి వెళ్లి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాలి. ఎఫ్2 నుంచి వరుసగా ఐదు సినిమాలు అక్కడ అద్భుతమైన ఆదరణని అందుకున్నాయి. అక్కడే ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ ఆదరణ మాటల్లో చెప్పలేను. కచ్చితంగా అక్కడికి వెళ్లి ప్రేక్షకుల్ని కలుస్తాను.

భీమ్స్ మ్యూజిక్ గురించి?

భీమ్స్ తో మ్యూజిక్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో తనకి నేను చాలా క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలను. ఆ ఫ్రీడమ్ మా మధ్య ఉంది. తన సినిమా కోసం ఎన్ని వెర్షన్స్ అయినా చేస్తాడు. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడి పని చేశారు. మా కాంబినేషను కంటిన్యూ అవుతుంది.

సంక్రాంతికి వస్తున్నాం, భగవంత్ కేసరి ఈ రెండు సినిమాలు కూడా ఇతర భాషల్లో రిమేక్ చేయడం ఎలా అనిపించింది?

ఇప్పుడు రిమేక్స్ తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో కూడా రీమిక్స్ చేస్తున్నారంటే పెద్ద రికార్డే( నవ్వుతూ). నాకు ప్రతిసారి కొత్త కథ చేయాలనిపిస్తుంది అందుకే నేను రిమేక్స్ చేయడానికి ఇష్టపడను. కొత్త బ్యాక్ డ్రాప్స్ లో సినిమాలు చేయడానికి ఇష్టపడతాను.

-ఎమోషన్స్ యాక్షన్ యూనివర్సల్ గా వర్క్ అవుట్ అవుతాయి. కానీ కామెడీకి మాత్రం లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి భాషకి ఒక ప్రత్యేకమైన టైమింగ్ ఉంటుంది. కామెడీ ఎంటర్టైనర్స్ రిమేక్ చేయడం కూడా ఒక విధంగా పెద్ద రిస్క్.

మీరు బడ్జెట్ కంట్రోల్లో సినిమాలు ఎలా చేయగలుగుతున్నారు?

-మనది అనుకుని చేయాలి. నిర్మాత ప్రతి పైసా కి నేను కాపలా ఉంటాను. ప్రతిదీ పేపర్ మీద ఉంటుంది. కాబట్టి కంట్రోల్ తప్పదు. ఈ సినిమా బడ్జెట్ పెరగాలన్న తగ్గాలన్న పగ్గాలు డైరెక్టర్ చేతిలోనే ఉంటాయి.

చిరంజీవి గారి మేనకోడలు ఈ సినిమాలో పాట పాడారు కదా? ఆ టాలెంట్ ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు?

-చిరంజీవి గారు ఈ సినిమా కోసం రెండు అద్భుతమైన టాలెంట్స్ ని ఫైండ్ అవుట్ చేశారు. ఆట సందీప్, అద్భుతమైన మాస్టర్ అవుతారని చెప్పారు. తనకి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే చిరంజీవి గారి చిన్న చెల్లెలు మాధురి గారి అమ్మాయి పాట ని సర్ ప్రైజ్ అయ్యాం. చిరంజీవి గారు పాట పాడించి నచ్చితేనే నచ్చితేనే పెట్టండి అని చెప్పారు. తను పాప్ మ్యూజిక్ కోర్స్ చేశారు. తన పాట పాడిన తర్వాత మేమందరం సర్ప్రైజ్ అయిపోయాము. అద్భుతమైన సింగర్.

సినిమా కలెక్షన్స్ 300 కోట్లు దాటింది నెక్స్ట్ టార్గెట్ 400 కోట్ల?

-అది అవ్వాలని కోరుకుంటున్నా. ఈ వీకెండ్ కూడా అద్భుతంగా ఉండబోతుంది. వీక్ డేస్ లో కూడా సినిమా చాలా స్టడీగా వెళుతుంది. ప్రతి ఏరియాలో షేర్స్ వస్తున్నాయి. ఈ వీకెండ్ కూడా బలంగా ఉంటుంది. చాలా మంచి నెంబర్ చూస్తాం.

-సంక్రాంతి ఒక ఫిలిం ఫెస్టివల్ లాగా అయింది. దానిలో నేను కీలక పాత్ర పోషిస్తుండం చాలా ఆనందంగా ఉంది.

నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారా?

-నెక్స్ట్ అని చెప్పలేను కానీ ఫ్యూచర్ లో కచ్చితంగా చిరంజీవి గారితో మరో సినిమా ఉంటుంది. మా ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉంది.

రాజమౌళి గారితో మిమ్మల్ని పోల్చడం ఎలా అనిపిస్తుంది ?

-వరుస విజయాలు రావడంతో ఆ పోలిక వచ్చి ఉండొచ్చేమో కానీ .. డైరెక్టర్స్ గా ఆ కంపారిజన్ కి ఆస్కారం లేదు. దర్శకుడిగా ఆయన చేసే సినిమాలు వేరు. నేను చేసే సినిమాలు వేరు. డైరెక్టర్ గా ఆయన ఎంతో ఎత్తున ఉన్నారు. ఆయన నాకు ఇష్టమైన దర్శకుడు. నేను ఇప్పుడే ప్రయాణాన్ని మొదలు పెట్టాను. ఇంకా ఎంతో దూరం ప్రయాణించాలి.

మీకు ఎనర్జీ ఇచ్చే విషయం ఏమిటి?

-థియేటర్స్ లో ఆడియన్స్ నవ్వుతున్నంత సేపు వాళ్ళ చిరునవ్వే నాకు ఎనర్జీ.

మంత్రుల టెన్షన్ || Chillagattu Sreekanth About Chandrabanu Plans To Change Cabinet Ministers || TR