సూపర్ కదా: ‘సాహో’ బడ్జెట్ మిగిల్చిన నారా లోకేశ్‌

 ‘సాహో’ కు నారా లోకేశ్‌ ఇంత సాయిం చేస్తారని ఊహిచం

పెద్ద సినిమాలకు ప్రమోషన్ బడ్జెట్ కూడా భారీగానే ఉంటుంది. అయితే ఆ సినిమా గురించి మీడియా నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటుంది కాబట్టి కాస్త ఉపశమనంగా ఉంటుంది. అయితే హఠాత్తుగా ఏ పాటో లేక వీడియోనో, ఫోటోనో వైరల్ అయిపోతే వచ్చే పబ్లిసిటీ మాత్రం ఓ రేంజిలో ఉంటుంది. ఇంక కాంట్రవర్శి అయ్యిందా మరీ మంచిది. ఇప్పుడు సాహోకు అదే కలిసి వచ్చింది. నెగిటివ్ అవుతుందనుకున్న టైమ్ లో రివర్స్ అయ్యి..పాజిటివ్ అయ్యింది. అదీ నారా లోకేష్ ద్వారా కావటం విశేషం.

సాహో నిర్మాతలు అలాంటి కాంట్రవర్సీ ఏదీ తమంతట తాముగా క్రియేట్‌ చేయకపోయినా,అనుకోకుండా లాభించి తమ చిత్రానికి మాత్రం బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ కలిసివస్తోంది. సాహో చిత్రాన్ని తెలుగుదేశం శ్రేణులు తొక్కేయబోతున్నారనే రూమర్ ఒక వెబ్‌సైట్‌లో వచ్చింది. ఆ రూమర్ కు సరాసరి టీడీపీ అధ్యక్షుడి తనయుడు నారా లోకేష్‌ స్పందించడంతో అది హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఈ వ్యవహారంలో క్లీన్‌ చిట్‌ ఇచ్చుకునే క్రమంలో సాహో కోసం తాను ఎంతగా ఎదురు చూస్తున్నదీ కూడా నారా లోకేష్‌ చెప్పారు. అంతేకాక అందరూ చూడాలని పిలుపు ఇచ్చారు. అదంతా పబ్లిసిటీకి అది మరింత దోహదపడింది. అన్ని న్యూస్‌ ఛానల్స్‌లో ప్రైమ్‌ టైమ్‌లో కవరేజ్‌ లభించింది. టీడీపీ కి చెందిన టీవీ ఛానెల్స్ లో అయితే గంటల కొద్దీ చర్చ కూడా జరుగుతోంది. ఇంత పబ్లిసిటీ కావాలంటే నిర్మాతలకు కోట్లు ఖర్చవుతాయి. కానీ పైసా ఖర్చు లేకుండా రెండు రోజులుగా సాహో న్యూస్‌లో నానుతోంది. సాహో డిస్కషన్‌ హల్‌చల్‌ చేస్తోంది.