డిసెంబ‌ర్ 13న వెంకీమామ‌

విక్ట‌రీ వెంక‌టే్‌శ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం వెంకీమామ‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్స్‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 13న సినిమా విడుద‌ల‌వుతుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మాట్లాడుతూ – ఏ సినిమాకు ఇంత నెర్వ‌స్‌గా లేను. 13వ తారీఖు ఎప్పుడోస్తుందో, ఎలాంటి ఫ‌లితం ఉంటుందో అని అనుకుంటున్నాను. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. అది మా తాత‌గారి కోసం. ఈ సినిమా మా తాత‌గారి డ్రీమ్‌. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, వెంకీమామ‌తో క‌లిసి సినిమా చేయాల‌ని ఎప్ప‌టి నుండో కోరిక ఈ సినిమాతో ఈ రెండు కోరిక‌లు తీరిపోయాయి. మా యూత్ అంద‌రికీ వెంకీమామ ఇంకా యూతే. సినిమా ట్రైల‌ర్ చూసి చాలా మంది ఫోన్ చేశారు. ఈ క్రెడిట్ బాబీకే ఇవ్వాలి. త‌న‌కు థ్యాంక్స్‌. త‌ను దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్ట్‌తో ట్రావెల్ అయ్యాడు. త‌న టీమ్‌కి, త‌మ‌న్‌కి థ్యాంక్స్‌. త‌మ‌న్ పాట‌ల‌కు మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. విక్ట‌రీ వెంక‌టేశ్ మాట్లాడుతూ -డిసెంబ‌ర్ 13న వెంకీమామ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ప్రేక్ష‌కుల నుండి వ‌చ్చిన రెస్పాన్స్‌తో మాకు చాలా ఎన‌ర్జీ వ‌చ్చింది. మా నాన్న‌గారు నాతో, చైతుతో సినిమా చేయాల‌ని బ‌లంగా అనుకున్నారు. ఆయ‌న కోరిక‌తోనే ఈ క‌థ మా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చింది. బాబీ, అత‌ని టీమ్ అద్భుత‌మైన వ‌ర్క్ చేశారు. ప్ర‌సాద్ మూరెళ్ల‌, ఆర్ట్ డైరెక్ట‌ర్స్ అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. త‌మ‌న్ సంగీతంతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లాడు. రాశీఖ‌న్నా, పాయ‌ల్‌ల‌తో మ‌రోసారి క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నాను. నా కెరీర్‌లో తొలిసారి నా బ‌ర్త్‌డేకు వ‌స్తున్న సినిమా ఇది. అభిమానులు అంద‌రూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అభిమానులు, ప్రేక్ష‌కులు నేను మంచి సినిమాలు చేసిన ప్ర‌తిసారి ఆద‌రిస్తున్నారు. ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం“ అన్నారు.