ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదకు ‘షర్మిల బాణాన్ని’ ప్రయోగించింది తెలుగుదేశం పార్టీ. అదీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ద్వారా. ఈ తరహా రాజకీయాలు టీడీపీకి కొత్తేమీ కాదు. కానీ, వైఎస్ జగన్ సోదరి షర్మిల, తన సోదరుడికి వ్యతిరేకంగా ఎందుకు నినదిస్తారు.? అవకాశమే లేదు. ఏనాడైనా షర్మిల, తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల ఎక్కడైనా అసహనం వ్యక్తం చేశారా.? లేదే! మరెలా ఈ గొడవ సాధ్యం.? షర్మిలకీ, జగన్‌కీ పొసగడంలేదట. ఈ గొడవలో కొడుకు జగన్ కంటే కుమార్తె షర్మిల పట్ల ప్రత్యేకమైన సానుభూతితో వున్నారట తల్లి విజయమ్మ. షర్మిల గనుక కొత్త పార్టీ పెడితే, ఆ పార్టీకి విజయమ్మ వెన్నుదన్నుగా నిలుస్తారట. ఇదీ, ‘కిరోసిన్ కిట్టు’గా పేరుబడ్డ ఓ మీడియా సంస్థ అధినేత అల్లిన కట్టు కథ. ఈ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. సీరియస్‌గా కాదు లెండి, సరదాగా.
ఔను, దీన్ని ఓ కామెడీ కథగా చాలామంది ఎంజాయ్ చేసేస్తున్నారు. రేపో మాపో షర్మిల మీడియా ముందుకొచ్చి, సదరు కథనంపై మండిపడటమో, పరువు నష్టం దావా వేయడమో జరగొచ్చు. తద్వారా తమకు పబ్లిసిటీ వస్తుందని సదరు మీడియా సంస్థ భావిస్తోందేమో. ఇలాంటివన్నీ ఆ మీడియా సంస్థకి అలవాటే. ఆ మాటకొస్తే.. ఇలాంటి కట్టు కథలు అల్లి, వివాదాలు సృష్టించే సదరు మీడియా సంస్థ ఇంతలా ఎదిగింది. వైసీపీని, వైసీపీ పాలనని ప్రశ్నించాలంటే.. ఆ పని మీడియా సంస్థలు నిరభ్యంతరంగా చేయొచ్చు.. అసలు మీడియా విధే అది. కానీ, మీడియా ఎప్పుడో నైతిక విలువలకు తిలోదకాలిచ్చేసింది. అయినా, జగన్‌కి వ్యతిరేకంగా పార్టీ పెట్టాలనుకుంటే, తెలంగాణలో ఎందుకు షర్మిల పార్టీ పెట్టబోతున్నారట.? సదరు మీడియా సంస్థ యజమానికి షర్మిలగానీ కలలోకి వచ్చి చెప్పలేదు కదా ఆ వవిషయాన్ని.! ‘రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడైనా మారొచ్చు..’ అన్న ఒక్క లైన్ పట్టుకుని, ఏవేవో కథలు అల్లొచ్చుగానీ.. జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసిన షర్మిల, జగన్‌కి వ్యతిరేకంగా రాజకీయ పార్టీ పెట్టడం అసాధ్యం. చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ అనుకూల మీడియా ప్రచారంలోకి తెచ్చిన ఈ కథనం పరోక్షంగా వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుంది.. టీడీపీతోపాటు, పచ్చ మీడియా ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ చేసేస్తుంది కూడా.