ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే సామెత ప్రకారం వ్యవహరిస్తున్నారనే అప ప్రధ వుంది. ఫలితంగా మంచైనా చెడైనా తనే బాధ్యత వహిస్తున్నారు. ఇలాంటి తరహా వ్యక్తులు అరుదుగా వుంటారు. సహజంగా వీరి ధోరణి కూడా బహు దూకుడుగా వుంటుంది.కొండ నైనా ఢీ కొంటారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారం అంశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి పలువురిని ఆశ్చర్యచకితులను చేసింది. ఒక పక్క హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసు విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వెలుబుచ్చుతూ తమ ఆదేశాలను అమలు చేయరా? అని నిలదీసి పైగా రమేష్ కుమార్ ను గవర్నర్ ను కలవ మని సూచించిన నేపథ్యంలో గవర్నర్ ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొని వుండగా వెంటనే స్టే కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఇందువలన పెద్దగా ప్రయోజనం లేక పోవచ్చు. ఎందుకంటే ఈ పాటికే సుప్రీంకోర్టు రమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చి వుంది. పైగా రమేష్ కుమార్ తొలగించుతూ ఆర్డినెన్స్ ఏలా తీసుకువస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించి వుంది.
Read More : చిరు ఓటు తమన్నాకు.. చెర్రీ ఓటు జాన్వీకి
అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అదికాదు. తాత్కాలికంగా నైనా హైకోర్టు ఆదేశాల మేరకు గవర్నర్ ఎట్టి ఆదేశాలు జారీ చేయకుండా నిలుపుదల చేయడమే. సుప్రీంకోర్టులో అప్పీలు వుంది కాబట్టి ఇప్పుడు తనేం చేయ లేనని గవర్నర్ రమేష్ కుమార్ కు చెప్పిపంప వచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జగ మొండి అని ఎందుకు అంటామంటే ఇందుకే. తను నిర్ణయించుకొన్నది అమలు జరిగి తీరాలి. ఒక వేళ ఏదైనా అమలు చేయకతప్పదనుకుంటే కాలికి వేస్తే మెడకు మెడకేస్తే కాలికి బంధం వేయడం ముఖ్యమంత్రి విధానంగా వుంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురైనా భరించేందుకు సిద్ధంగా వుంటారు. ఒక విధంగా ఈ మొండి ధెర్యమే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందేమో.
Read More : విజయసాయికి అల్లుడి వైద్యం మీద నమ్మకం లేదా!
కరోనా వైరస్ వ్యాప్తి నిజమైనా తనతో చర్చించకుండా రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీర్ణం చేసుకోలేక పోయారు. అందుకే ఏమైనా జరగనీయని రాజ్యాంగ బద్ద పదవిలో వున్న రమేష్ కుమార్ ను ఆర్డినెన్స్ తీసుకు వచ్చి తొలగించారు. ఈ సందర్భంలో చాలా మంది న్యాయ నిపుణులు ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన సమయంలో రాష్ట్ర న్యాయశాఖతో పాటు పలువురు సలహాదారులు ముఖ్యమంత్రికి ఎందుకు సలహా ఇవ్వలేదని ప్రకటనలు చేశారు. వారికి అసలు విషయం తెలియదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించినది అమలు జరిగి తీరాలి. ఏమైనా సరే సాధ్యమైనంత వరకు రమేష్ కుమార్ తిరిగి ఎన్నికలు కమిషనర్ గా బాధ్యతలు చేపట్ట కూడదనే పట్టుదలే తుదకు న్యాయ స్థానాల వద్ద మాటలు పడ వలసి వచ్చినా భరించారు. ఒక వేళ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టి ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనా అందుకు రెడీగా ముఖ్యమంత్రి మరో ఆయుధం ప్రయోగించ వున్నారు. కొత్తగా జిల్లాల ఏర్పాట్లు పూర్తి అయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఈ లోపు రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తవుతుంది. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆటుపోట్లు తగిలినా వెరవ కుండా తను భావించింది అమలు చేస్తున్నారు.
Read More : నితిన్ పెళ్లికి వెళ్లొద్దు.. పవన్ ఫ్యాన్స్‌లో టెన్షన్
జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసిన సందర్భంలో డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కుటుంబ సమేతంగా సోనియా గాంధీని కలసినపుడు కొంత కాలం నిరీక్షించమని చెప్పిన అంశం అందరికీ తెలుసు. తండ్రి రాజశేఖర రెడ్డి అంత ఓపికగా కాంగ్రెస్ లో ఉండలేకపోయారు. ఎన్నో కేసులను భరించి తుదకు జైలు జీవితం కూడా అనుభవించ వలసి వచ్చింది. సోనియా గాంధీ సూచన మేరకు కొంత కాలం నిరీక్షించి వుంటే కొంత కాలానికే ఇన్ని తిప్పలు లేకుండా ముఖ్యమంత్రి అయ్యేవారేమో!
Read More : వైకాపా ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త కన్నుమూత
కాని తను భావించినట్లే ముల్ల బాటనే ఎంచుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా అదే బాటలో నడుస్తున్నారు. అందులో భాగంగానే ఒక సంవత్సరం లోపే తన పేషీలో కూడా అనూహ్యమైన మార్పులు చేశారు. చాల మంది ఈ పరిణామాలు ఆశ్చర్యం కలిగించ వచ్చు. కాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహజ సిద్ధమైన స్వభావం వైఖరి ముందుగా అర్థం చేసుకొంటే ఇవేవీ ఆశ్చర్యం కలిగించవు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పేషీ నుండి కొంత మందిని తప్పించారంటే వారంతా తను చెప్పినట్లు వ్యవహరించక పోవడమే. తన మనసెరిగి సలహా ఇవ్వక పోవడమే.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పేషీ నుండి తప్పించ బడిన డాక్టర్ పివి రమేష్ తాజాగా చేసిన ట్వీట్ చూస్తే సులభంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తత్వం బోధ పడుతుంది. ఐఎఎస్ ఐపియస్ లు పాలక వర్గాల సేవలో తరిస్తున్నారని ట్వీట్ చేశారంటే ఆలాంటి సేవ చేయనందుననే తనను తొలగించారని పరోక్షంగా చెప్పడమే. అయితే అది సమస్య కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను చెప్పినట్లునడుచుకోలేని వారినందర్నీ తప్పిస్తారు. ఇదీ అసలు చిదంబర రహస్యం