విడదలకు విడుదల: నక్కతోక తొక్కిన రజనీ!

రాజకీయాల్లో అయినా, సినిమా రంగంలో అయినా టాలెంట్ కంటే అదృష్టం చాలా ముఖ్యం అంటుంటారు. కొంతమందికి అద్భుతమైన నటనా ప్రావీణ్యం ఉన్నా – అందచందాలున్నా… ఆ అదృష్టం లేక ఫెయిల్ అయిపోతుంటారు. మరికొందరు అందంగా లేకపోయినా… సర్జరీలు చేయించుకుని మరీ సక్సెస్ లు కొట్టేస్తుంటారు. అది లక్ కి ఉన్న గొప్పతనం! ఇక రాజకీయాల్లో కూడా లక్ పుష్కలంగా ఉన్న నాయకులు ఫుల్ సక్సెస్ అవుతుంటారు. కొంతమంది నాయకులు మాత్రం ఎంత విషయమున్నా.. మరెంత ప్రోత్సాహం ఉన్నా.. సొమ్ములు కూడా పుష్కలంగా ఉన్నా… ఆ లక్ ఫ్యాక్టర్ పనిచేయక ఫెయిల్ అవుతుంటారు. ఇందులో భాగంగా విడదల రజనీ పేరు ఆదృష్టవంతుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఈమెను లక్కీయెస్ట్ పొలిటీషన్ అని అంటున్నారు విశ్లేషకులు.

వివరాళ్లోకి వెళ్తే… ఎన్నారైగా ఉన్న విడదల రజనీ తొలుత తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. పసుపు కండువా కప్పుకుని నాడు జగన్ పై అంతెత్తున లేచేవారు. అయితే అప్పటికే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చిలకలూరి పేట లో పాతుకుపోయిన టీడీపీ నేతగా ఉన్నారు. దీంతో ఆయన ఉన్నంత వరకూ తాను టీడీపీలో ఎదిగేది ఉండదని బలంగా భావించిన విడదల రజనీ వ్యూహాత్మకంగా వైసీపీలోకి వెళ్లిపోయారు.

వెళ్లడమే తరువాయి చిలకలూరిపేట టిక్కెట్‌ ను చేజిక్కించుకున్నారు. అప్పటికే అక్కడ బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌ ఉన్నప్పటికి… సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా ఆమెకే జగన్ టిక్కెట్టిచ్చారు. 2019 ఎన్నికల్లో వీచిన బలమైఅన్ ఫ్యాన్ గాలిలో ఆమె సునాయాసంగా గెలిచారు. ఇదేక్రమంలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినా కూడా… మరోసారి సామాజిక సమీకరణల్లో భాగంగా జగన్ ఆమెకు మంత్రిపదవి అప్పగించారు. దీంతో ఇక వైసీపీలో పాతుకుపోయారులే అనుకుంటున్న ఆమెకు, ఆమె ఫ్యాన్స్ కు మర్రి రాజశేఖర్ రూపంలో టెన్షన్ మాత్రం వెంటాడుతూనే ఉంది.

ఈసారి రజనీకి ఇచ్చారు కాబట్టి… నెక్స్ట్ ఆమెను ఆపి మరీ రాజశేఖర్ కే చిలకలూరిపేట అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తారని వార్తలు హల్ చల్ చేస్తూ ఉండేవి. మర్రి వర్గం కూడా విపరీతంగా ఆ విష్యాన్ని షేర్ చేసేది. అయితే తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ గెలిచారు. దీంతో… ఇక ఫుల్ రిలాక్స్ మూడ్ లోకి వచ్చేసిన రజని… గుంటూరు జిల్లాలో కమ్మ సామాజికవర్గంతో పాటు బీసీలు కూడా ఎక్కువగా ఉండటంతో ఈసారి కూడా టిక్కెట్ తమనేతకేనన్న ధీమాతో ఉన్నారంట. దీంతో… రజనీని… మోస్ట్ లక్కీయెస్ట్ పొలిటీషియన్ అని అంటున్నారు విశ్లేషకులు!