రాంగోపాల్ వర్మ చెప్పింది ఎందుకు చేస్తాడు? చేసేది ఎందుకు చెబుతాడు? సందర్భాన్ని బట్టి వర్మ నిర్ణయాలు మారిపోతుంటా యి. అదే వర్మ…రాంగోపాల్ వర్మ..సంచలనాల వర్మ. వివాదాస్పద అంశాల్ని టచ్ చేయడమే వర్మకు తెలిసింది. ఆ పాయిట్ ని ఎన్ క్యాష్ చేసుకోవడమే వర్మ స్టైల్. `పవర్ స్టార్` టైటిల్ తో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జీవితాన్ని( ఎన్నికల తర్వాత) అని చెప్పి ఎలా రెచ్చిపోయాడో తెలిసిందే. రిలీజ్ కు ముందు…రిలీజ్ తర్వాత నానా రభస జరిగింది. అలాగని వర్మ మారతాడా? చస్తే జరగదు. అదే జరిగితే సంచలనాలు ఎలా? అదే వర్మ లాజిక్…స్ర్టాటజీ. తాజాగా `మర్డర్` అనే ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
మిర్యాలగూడ ఘటన(అమృత-ప్రణమ్) ప్రేమ కథను కాకుండా…అందులో ఉన్న హింసని తనదైన స్టైల్లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కూతురు పట్ల తండ్రికున్న ప్రేమ…తండ్రి పట్ల కూతురుకున్న ప్రేమ, కక్షని కలగలిపి వండి వార్చబోతున్నాడు. ఇక ఈ సినిమా చేస్తున్నట్లు బయటకు వచ్చిన నేపథ్యంలో వర్మ ఎంత వినయంగా మాట్లాడాడో తెలిసిందే. ఇందులో కులాల్ని కెలకలేదు. కేవలం సున్నితమైన అంశాల్నే తీసుకుని అంతే సున్నితంగా చెబుతున్నానన్నాడు. కానీ ఈరోజు మర్డర్ ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో కులాన్నే కెలికాడు అని తెలుస్తోంది.
అమ్మాయి..అబ్బాయి..తల్లి..తండ్రి.. పిల్లలని ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లల్ని కనగలం గానీ, వాళ్ల మనస్థత్వాల్ని కనగలమా? సమాధానం మీరే చెప్పండి అంటూ? సమాజం మీదకే తోసాడు వర్మ. అవును ఇవ్వన్నీ వర్మ ట్రైలర్ లో భాగంగా రివీల్ చేసిన పాయింట్లు. తనదైన శైలి మేకింగ్ తో ట్రైలర్ అదరగొట్టాడు. బ్యాక్ గ్రౌండ్ ఆర్ ఆర్ ఆర్ చింపేసాడు. అమృతపై మారుతురావుకి ఉన్నతండ్రి ప్రేమ…అల్లుడిపై మారుతురావుకి ఉన్న కక్షను ఓ రేంజ్ లో చూపించాడు. ఈ సినిమాకి వర్మ ఇచ్చిన ఉప శీర్షిక ఏంటో తెలుసా? ఇది ఓ కుటుంబ కథా చిత్రం అని. ఈ మొత్తం ట్రైలర్ పరిశీలిస్తే కులాన్నే కథలో హైలైట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.