Avatar 3: అవతార్.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదల అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. తెలుగుతోపాటు అనేక భాషల్లో విడుదల ఈ రికార్డుల మోత మోగించింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎంతగానో ఆదరించారు. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్. ప్రపంచ సినీ చరిత్రలో ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి.
మొదటి భాగంలో పండోర అనే గ్రహాన్ని క్రియేట్ చేసి అందులోని ప్రకృతి అందాలను కళ్లుచెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశారు దర్శకుడు. ఆ తర్వాత పార్ట్2 అవతార్: ది వే ఆఫ్ వాటర్ మూవీతో మెప్పించారు. అయితే తాజాగా ఇప్పుడు మూడవ భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్ గురించి అదిరిపోయే అప్‌డేట్ ను ప్రకటించారు మూవీ మేకర్స్. కాగా అవతార్ ప్రాంఛైజ్ చిత్రాల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడవ భాగం అవతార్- ఫైర్ అండ్ యాష్ ఫస్ట్ లుక్ ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఆపై జులై 25న మొదటి ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
https://twitter.com/officialavatar/status/1947403470249824416?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1947403470249824416%7Ctwgr%5E16c4faf2d0d1d145be50a3bf0b550f622ecb67ee%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Favatar-3-movie-trailer-update-details-2512632
2026 డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా దాదాపు160 భాషల్లో అవతార్ 3 విడుదల కానున్నట్లు ప్రకటించారు. కాగా పార్ట్2 అయిన అవతార్: ది వే ఆఫ్ వాటర్ లో కేట్ విన్స్‌లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో మరింత పొడిగించామని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పారు. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకున్నట్లు కూడా తెలిపారు. అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా రానున్న అవతార్ 4 2029లో అవతార్ 5 డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే తెలిపింది.
