HHVM: విడుదలైన 24 గంటల్లోనే అన్ని మిలియన్ల వ్యూస్ సాధించిన హరిహర వీరమల్లు ట్రైలర్.. ఇది ఆరంభం మాత్రమే అంటూ!

HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో నిరీక్షణలో ఎదురుచూపులు, అడ్డంకులు సమస్యలు అన్నింటిని దాటుకొని ఎట్టకేలకు ఈ సినిమా ఇటీవల షూటింగ్ ని పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాను జూన్ నెలలోనే విడుదల చేస్తామని మొదట మూవీ మేకర్స్ ప్రకటించినప్పటికీ వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ పడడంతో ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.

పీరియాడికి యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈనెల అనగా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈసారి ఈ సినిమా సమయానికి విడుదల చేస్తారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈసారి మాత్రం విడుదల తేదీని వాయిదా వేసే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మూవీ మేకర్స్ సినిమా షూటింగ్ పూర్తి అవడంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను షురూ చేశారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ట్రైలర్ కేవలం విడుదలైన 24 గంటల్లోనే దాదాపుగా 48 మిలియన్లకు పైగా వ్యూస్ ని సాధించి ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. అలాగే ఈ చిత్రం అన్ని భాష‌ల్లో 24 గంట‌ల్లో 61.7 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఇది జ‌స్ట్ రికార్డు మాత్ర‌మే కాదు త‌దుప‌రి కొల్ల‌గొట్ట‌బోయే వాటికి ఇది వార్నింగ్ అంటూ రాసుకొచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే ముందు ముందు ఉంది అసలైన సినిమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

#HariHaraVeeraMallu - Trailer (Telugu) | PSPK | Nidhhi | MM Keeravaani | AM Rathnam | Jyothi Krisna