Uttam Kumar Reddy: నేనెప్పుడూ ఓడిపోలేదు.. ఒకే పార్టీ నుంచి 7 సార్లు గెలిచా: మంత్రి ఉత్తమ్

రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రస్థానం, సీనియారిటీతో పాటు కోదాడ ఘటన, డీసీసీ నియామకాలపై ఆయన కీలక స్పష్టత ఇచ్చారు.

ఓటమి ఎరుగని నేతను ప్రస్తుత అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తానే సీనియర్ సభ్యుడినని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, కేసీఆర్ వివిధ పార్టీల నుండి గెలిచారని, తాను మాత్రం ఒకే పార్టీ (కాంగ్రెస్) నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధించానని చెప్పారు. అంతేకాకుండా, కేసీఆర్ గత ఎన్నికల్లో కామారెడ్డిలో ఓడిపోయారని, కానీ తాను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఓటమి చవిచూడలేదని మంత్రి వ్యాఖ్యానించారు.

Ambati Rambabu: చంద్రబాబును కాపాడేందుకే పవన్ ‘డైవర్షన్ పాలిటిక్స్’.. అంబటి రాంబాబు ఫైర్

కోదాడ ఘటనపై స్పష్టత ఇటీవల కోదాడలో చోటుచేసుకున్న ఘటనపై మంత్రి స్పందిస్తూ.. అది లాకప్ డెత్ కాదని స్పష్టం చేశారు. మరణించిన వ్యక్తిపై సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కుల ఫోర్జరీ, ఫ్రాడ్ కేసులు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన విచారణలో భాగంగానే పోలీసులు చర్యలు తీసుకున్నారని పరోక్షంగా వెల్లడించారు.

డీసీసీ పదవులపై.. నూతనంగా నియమితులైన డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యపేట డీసీసీ పదవి గురించి ప్రస్తావిస్తూ.. ఆ పదవిని అధిష్టానం తమకు ఇస్తామని చెప్పినప్పటికీ, తామే వద్దనుకున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

కిరాణా కొట్టు డోరే యముడు | Cine Critic Dasari Vignan About Bhadradri Kotha Gudem Women Incident | TR