ఆమె ఓ యువనటి. ఈ మధ్యనే ఓ హిట్ సినిమాలో నటించింది. ఆ సినిమా డైరెక్టర్ కూడా యంగ్.! దాంతో, ఆ ఇద్దరి మధ్యా ఏదో వుందన్న పుకార్లు షురూ అయ్యాయి. గతంలోనూ ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. సినిమాల్లో ఈ గాసిప్స్ ట్రెండ్ గురించి ఆమెకీ తెలుసు.
గాసిప్స్ ఎలా పుడుతున్నాయ్.? అని ఆరా తీస్తే, అసలు విషయం బయటపడిందట. ఆ దర్శకుడి తరఫునుంచే ‘మేటర్’ లీక్ అయ్యిందని. నిజానికి, ఆ ఇద్దరి మధ్యా ఏమీ లేకపోయినా, దర్శకుడితో సన్నిహితంగా వుండే ఓ ‘పీఆర్’ ఈ దుష్ప్రచారానికి తెరలేపాడట.
ఆ ‘పీఆర్’ గురించి ఓ ప్రముఖ నిర్మాత, కమెడియన్ కూడా ఈ మధ్యనే సోషల్ మీడియాలో గుస్సా అయ్యాడు. సదరు హీరోయిన్‌ని ఆ పీఆర్ ఏదో అడిగాడనీ, ఆమె అందుకు నిరాకరించడంతోనే ఇదంతా జరిగిందనీ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
యంగ్ హీరోలలో కొందర్ని సదరు పీఆర్ బ్లాక్‌మెయిల్ చేయడం కొత్తేమీ కాదనీ, ఇప్పుడు హీరోయిన్ల వెంట కూడా పడ్డాడనీ అంటున్నారు.