Richest Heroine: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువ అన్న విషయం మనందరికీ తెలిసిందే. హీరోల రెమ్యునరేషన్ రెండంకెల మూడంకెల సంఖ్యలో ఉంటే హీరోయిన్ల రెమ్యూనరేషన్ మాత్రం సింగిల్ డిజిట్ లో ఉంటుంది. అంటే స్టార్ హీరోలు తక్కువలో తక్కువ 40 కోట్ల నుంచి దాదాపు 200 కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం కేవలం 10 కోట్ల లోపే ఉంది. కొంతమంది హీరోలకు ఒక్క సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ హీరోయిన్లకు పది సినిమాలు చేసిన రాదు. అలాగే వాళ్ల సినీ కెరీర్ కూడా తక్కువ కాలమే ఉంటుంది. వయసు 40 ఏళ్లు దాటితే సినిమా చాన్స్‌లు కూడా రావు.
అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా అవకాశం ఉన్నప్పుడే వరుస సినిమాలు చేస్తుంటారు. ఎంత సంపాదించినా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆ హీరోల సంపాదనతో పోలిస్తే హీరోయిన్ల సంపాదన చాలా తక్కువగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ మాత్రం ఏకంగా చిరంజీవి, హృతిక్ రోషన్ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలను మించి ఆస్తులను కలిగి ఉంది. ఆ హీరోయిన్ మరెవరో కాదండోయ్ జూహీ చావ్లా. భారతదేశంలోనే అత్యంత సంపన్నురాలైన సినీనటిగా ఈమె రికార్డ్ కెక్కింది. కాగా ఇండియాలో ఎప్పటికప్పుడు సంపన్నుల జాబితాను వెల్లడించే హురున్ ఇండియా అనే సంస్థ తాజాగా కూడా 2024 కు సంబంధించిన సంపన్నుల జాబితాను విడుదల చేసింది.
ఇందులో జూహీ చావ్లా మొదటి స్థానంలో నిలిచింది ఆమె ఆస్తుల మొత్తం విలువ 4600 కోట్లు. సినిమా రంగంలో షారుఖ్ ఖాన్ 7300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో జుహి చావ్లానే ఉంది. మూడో స్థానంలో హృతిక్ రోషన్ 2000 కోట్లు, నాలుగో స్థానంలో అమితాబ్ బచ్చన్ 1200 కోట్లు ఉన్నారు. జూహి చావ్లా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు చాలా మందే ఉన్నా, ఆస్తుల విషయంలో మాత్రం జుహినే మొదటి స్థానంలో ఉన్నారు. నటనకు దూరంగా ఉన్నా నిర్మాతగా కొనసాగుతున్నారు. తన జూహీ ప్రొడక్షన్స్ లో షారుఖ్ పార్టనర్. డ్రీమ్స్ అన్‌లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ తో జూహీ చావ్లా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. షారుఖ్ కొనుగోలు చేసిన ఐపీఎల్ టీమ్ కోల్‌కటా నైట్‌రైడర్స్ లో ఆమె కూడా పార్ట్‌నర్ గా ఉంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే ఇలా పలు వ్యాపారాలు చేయడంతో జూహి చావ్లా ఆస్తులు విపరీతంగా పెరిగాయి.