అర్ణబ్ బెయిల్ ఇస్తున్న సందేశం ఏమిటి”

some people shoking on arnab goswami bail
రిపబ్లిక్ టీవీకి సర్వస్వము అయిన అర్ణబ్ గోస్వామికి సుప్రీమ్ కోర్టులో ఆగమేఘాలమీద బెయిల్ రావడం కొందరికైనా ఆశ్చర్యం కలిగించి ఉంటుంది.  దేశంలో వేలాదిమంది కేవలం ఆరోపణల మీద పదేళ్లు, ఇరవై ఏళ్లుగా బెయిల్ రాక జైళ్లలో మగ్గుతున్నారు.  మనదేశంలో శిక్షాకాలం కన్నా బెయిల్ దొరక్క రిమాండ్ ఖైదీలుగా గడిపేవారు ఎక్కుమంది ఉన్నారు.  ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ కేసులు పెట్టినపుడు ఆయన సహజంగా రావలసిన బెయిల్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించాయి న్యాయస్థానాలు.  దేశంలో ఏ న్యాయస్థానంలోనూ ఆయనకు పదహారు నెలలదాకా ఊరట లభించలేదు.  కేంద్ర మాజీ మంత్రి, ఆర్ధిక నిపుణుడు, ప్రముఖ న్యాయవాది,  చిదంబరం సైతం బెయిల్ రాక దాదాపు నాలుగు మాసాలు జైల్లో ఉండాల్సివచ్చింది.  అనేకమంది పౌరహక్కుల సంఘాల నేతలు, విప్లవకారులు, కవులు, కళాకారులు వరవరరావు లాంటి ఎనభై సంవత్సరాల ముదివగ్గులు కూడా బెయిల్ కు నోచుకోక జైళ్లలో మగ్గిపోతున్నారు.  కరోనా సోకిందని వేడుకున్నా న్యాయస్థానాలు కనికరించలేదు. 
some people shoking on arnab goswami bail
some people shoking on arnab goswami bail
 
కానీ, ఆర్ణాబ్ గోస్వామి కోర్టులో పిటీషన్ వెయ్యడమే ఆలస్యం దానికి నంబర్ రావడం, విచారణ జరగడం, బెయిల్ మంజూరు చెయ్యడం చకచకా జరిగిపోయాయి!  బెయిల్ ఇవ్వడం సరే…ఆ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు చూడండి….    ‘టీవీ చానెల్స్‌ అరుపులను ప్రభుత్వాలు పట్టించుకుంటే ఎలా? రిపబ్లిక్‌ టీవీలో అతని అరుపులపై మీ ఎన్నికల భవిష్యత్‌ ఆధారపడిందా? మేం ఆ టీవీ చూడం.. కానీ, మహారాష్ట్ర సర్కార్‌ చేసింది సరైందిగా భావించ‌డం లేదు. వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి దూస్తే మేమున్నామని గుర్తుంచుకోండి’ అని హెచ్చ‌రిక చేసింది ధర్మాసనం.  
 
దీన్నిబట్టి మనం ఏమి అర్ధం చేసుకోవాలి?  వ్యక్తులకు భావప్రకటనాస్వతంత్రం రాజ్యాంగం కల్పించిన హక్కు.  దాన్ని ప్రభుత్వాలు హరించరాదు.  అంటే భావప్రకటనా స్వేచ్చకు హద్దులు లేవా?  క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నది కాబట్టి వదిలేయాలా?  ఆర్ణాబ్ గోస్వామి అరుపులు, కేకలకు ప్రభుత్వాలు పడిపోకపోవచ్చు. కానీ టీఆర్పీ రేటింగ్ విషయంలో అతను మోసాలకు పాల్పడ్డాడని ఆరోపించారు కదా?  అలాగే ఆర్ణాబ్ కారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది కదా ప్రభుత్వం?  ఈ విషయంలో ప్రభుత్వ వాదనను తిరస్కరించి ఆర్ణాబ్ కు బెయిల్ మంజూరు చెయ్యడం వెనుక కేంద్రప్రభుత్వం రహస్య జోక్యం ఉన్నదని భావించాలా?  ఎవరి మద్దతూ లేకుండానే అంత ఈజీగా బెయిల్ రావడం సాధ్యమేనా?  అంత సులభమైతే మిగిలిన కేసుల్లో ఎందుకు సాధ్యం కావడం లేదు?  అసలు బాధితుల మొర కోర్టు ముంగిటికి ఎందుకు చేరడం లేదు?  
 
ఈ విషయంలో సుప్రీమ్ కోర్ట్ చేసిన వ్యాఖ్యలు తెలుగు ఛానెల్స్ లో పచ్చమీడియా గా ప్రసిద్ధమైన టీవీ 5 , టీవీ 9 , ఏబీఎన్ లాంటి చానెళ్లకు మరింత బలాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇప్పటికే వారు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల మీద చెలరేగిపోతున్నారు.  ఇరవైనాలుగు గంటలు వారి ప్రభుత్వాల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. వ్యతిరేకప్రచారాన్ని ఆకాశాన్ని అంటిస్తున్నారు.  వారి మీద చర్యలు తీసుకోవాలని టీఆరెస్, వైసిపి అభిమానులు, నాయకులు డిమాండ్ చేస్తుంటారు.  అయినప్పటికీ కేసీఆర్, జగన్ వారి జోలికి వెళ్లడం లేదు.  ప్రకటనలు ఆపేసి కొంత నష్టం కలిగించినప్పటికీ, వారిని అరెస్ట్ చెయ్యడం జరగలేదు.   వారి జోలికి వెళ్తే మేమున్నాం అని సుప్రీమ్ కోర్ట్ హెచ్చరించిన నేపథ్యంలో పచ్చమీడియా మరింత చెలరేగిపోవచ్చు.  తమకున్న భావప్రకటనా స్వాతంత్య్రాన్ని అడ్డం పెట్టుకుని మరింతగా కేసీఆర్, జగన్ ల మీద దాడి చెయ్యవచ్చు.  లక్ష కాదు..పదిలక్షల కోట్లు దోచుకున్నాడని గొంతులు చినిగిపోయేలా కేకలు పెట్టొచ్చు.    అయినప్పటికీ వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.  ఎందుకంటే గౌరవన్యాయస్థానాలు “వారి హక్కులను” కాపాడతాయి మరి!  వారి అరుపులకు, దుష్ప్రచారాలకు ప్రభుత్వాలు భయపడకూడదు కదా!  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు