బిగ్ బ్రేకింగ్ : రూ.2వేల నోటును రద్దు చేసిన ఆర్.బి.ఐ.

గతంలో వచ్చిన గాసిప్స్ నిజమయ్యాయి. రూ. 2000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. సెప్టెంబర్ 30 – 2023 లోపు వాటిని మార్చుకోవాలని ప్రజలకు సూచించింది.

తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు ఆర్ బి ఐ కొన్ని సూచనలు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క “క్లీన్ నోట్ పాలసీ” ప్రకారం.. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2000 డినామినేషన్ లను బ్యాంక్ నోట్లు చట్టబద్ధమైన టెండర్ గా కొనసాగుతాయి. ఈ నోటును కలిగి ఉన్న ప్రజలంతా సెప్టెంబర్ నెలాఖరు లోపు బ్యాంకుల్లో అందించి తిరిగి రూ.500 నోట్లలోపు తీసుకోవాలి. అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30 – 2023 వరకు 2000 నోట్లకు డిపాజిట్ మార్పిడి సౌకర్యాన్ని అందిస్తాయి.