ఇదొక్కటీ చేయగలిగితే బీజేపీ చేతిలో పవన్ కీలుబొమ్మ కాదని రుజువవుతుంది

Pawan Kalyan should get Tirupati by polls ticket for Janasena 
జనసేన, బీజేపీ పొత్తులో విపరీత పరిణామాలు చోటుచేసుకున్నాయి.  రాష్ట్రంలో బీజేపీ కంటే జనసేనకు ఓటు బ్యాంకు ఎక్కువ.  పవన్ కళ్యాణ్ స్థాయి జనాకర్షణ కలిగిన నేతలు బీజేపీలో ఒక్కరూ లేరనేది వాస్తవం.  అలాంటి వారే ఉంటే అసలు జనసేనను చేరదీయాల్సిన అవసరం బీజేపీకి ఏముంది.  మొదట్లో జనసేన, బీజేపీల కూటమికి పవనే మెయిన్ ఫేస్ అని అందరూ అనుకున్నారు.  కానీ మెల్లగా సీన్ మారిపోయింది.  పవన్ లోని అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని జనసేనను నియంత్రించే స్థాయికి వెళ్ళిపోయింది బీజేపీ.  ఇన్నాళ్లు రాబోయే ఎన్నికల్లో  కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటూ వచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు ఆ మాట ఎత్తడంలేదు. 
Pawan Kalyan should get Tirupati by polls ticket for Janasena 
Pawan Kalyan should get Tirupati by polls ticket for Janasena
 
అసలు తిరుపతి ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థినే నిలబెట్టాలని  నిర్ణయం జరిగిపోయింది.  దుబ్బాకలో గెలుపును చూపించి తిరుపతిలో టికెట్ దక్కించుకోవాలని చూస్తోంది బీజేపీ.  కూటమిలో ఏ పార్టీకి ప్రజా బలం ఎక్కువగా అంటే ఆ పార్టీకే ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉంటాయి.  కానీ ఇక్కడంతా రివర్స్ వెళుతోంది.  తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనకు చోటు లేకుండా పోతోంది.  ఇదే జనసేన  కార్యకర్తలకు, నేతలకు నచ్చడంలేదు.  తిరుపతిలో ఏ విధంగా చూసుకున్నా  తమకే ఎక్కువ బలముందనేది జనసేన వాదన.  ఎందుకంటే గతంలో తిరుపతి నుండి చిరంజీవి అసెంబ్లీకి వెళ్లారు.  అక్కడ పవన్  సామాజికవర్గం ఎక్కువ.  కాబట్టి జనసేనకు బలమైన పునాదులు ఉన్నాయని కార్యకర్తలు చెబుతున్నారు.  పైగా ఎన్నికలు ముగిశాక వస్తున్న మొదటి ఉప ఎన్నికలు కావడంతో బరిలో నిలవకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయని  ఆందోళన చెందుతున్నారు. 
 
అందుకే ఎలాగైనా తిరుపతి బరిలో జనసేన అభ్యర్థి ఉండాలని కోరుతున్నారు.  కానీ పవన్ ఏమో ఇప్పటి వరకు ఈ విషయమై ఒక్క మాట కూడ మాట్లాడలేదు.  ఏదో ముందుండి కూటమిని నడిపించి పెద్ద నాయకుడిగా ఎదుగుతారని అభిమానులు, కార్యకర్తలు ఆశపడుతుంటే పవన్ మాత్రం అన్నీ బీజేపీకి వదిలేసి లొంగిపోయినట్టు వ్యవహరిస్తున్నారు.  అసలు బీజేపీలో కూడ పవన్ మన దారిలోకి వచ్చేశాడని, ఏం చెప్పినా వింటాడనే భావన ఉంది.  దీన్ని గమనించిన జనసైనికులు ఇలాగే ఉంటే  చివరికి బీజేపీకి తోక పార్టీగా మిగిలిపోవడం తప్ప చేసేదేమీ ఉండదని అంటున్నారు.   కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో గనుక పవన్ జనసేన అభ్యర్థిని నిలపగలిగితే కూటమి మీద ఆయనకు పూర్తి పట్టుందని చాటుకోవచ్చు.  లేకుంటే కార్యకర్తలు భయపడుతున్నట్టు లొంగిపోయారనే మాటే నిజమవుతుంది.