లిక్కర్ స్కాం: కవిత అరెస్టుకు ముహూర్తం ఫిక్స్!

ప్రస్తుతం తెలంగాణలోనే కాకుండా… దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో.. సీబీఐ తనపని తాను చేసుకుంటూపోతోన్న సంగతి తెలిసిందే! దేశాన్ని కుదిపేసిన.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

అయితే… ఈ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవిత పేరు కూడా మొదటి నుంచీ వినిపిస్తుండటంతో… ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఈ స్కాం ఇప్పుడు హాట్ టాపిక్ గా మరింది! రేపో మాపో కవిత ను కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపే సూచనలు ఉన్నాయని.. ఆ దిశగా సీబీఐ సాక్ష్యాలు సేకరిస్తుందని అంటున్నారు!

దేశాన్ని కుదిపేసిన ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ.. తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సైతం అరెస్టు చేసి.. దూకుడు పెంచామనే సంకేతాలు ఇచ్చింది. దీంతో… “నెక్స్ట్ కవితే” అని అంటున్నారు.. బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, వివేక్ వెంకటస్వామి!

పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో నగదు కోసం కేజ్రివాల్ తో ఒప్పందం కుదుర్చుకున్న కవిత.. రూ.150 కోట్లు ఆప్ గవర్నమెంట్‌ కు ఇచ్చారని వివేక్ సంచలన ఆరోపణలు చేశారు. సుసోడియా ఎలాగైతే‌ జైలుకి వెళ్లారో.. నెక్స్ట్ కవిత కూడా జైలుకు వెళ్లక తప్పదని వివేక్ సంచలన కామెంట్లు చేశారు!

అక్కడితో ఆగని ఆయన… లిక్కర్ స్కామ్‌ ను ఢిల్లీ, పంజాబ్‌ లోనే కాకుండా, దేశం అంతా అప్లై చేయాలని అనుకున్నారని వివేక్ ఆరోపించారు. ఈ లిక్కర్ స్కామ్‌ ను సీరియస్ గా తీసుకున్న సీబీఐ.. చాలా మందినే అరెస్టు చేసే పరిస్ధితులు ఉన్నాయని అంటున్నారు వివేక్!

దీంతో… బీఆరెస్స్ లో ఒక్కసారిగా తీవ్ర చర్చ నడవడం మొదలయ్యింది! ఇప్పుడిప్పుడే జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని కేసీఆర్ సిద్దపడుతుంటే… కవిత ఈ రకంగా జాతీయ స్థాయిలో హైలెట్ అవుతున్నారని ఫీలవుతున్నారంట. అయితే… కవిత అరెస్టు ఇప్పట్లో ఉండకపోవచ్చని… కేసీఆర్ ని దెబ్బకొట్టే క్రమంలో.. సరిగ్గా తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమయం చూసి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు!